Munne pulugadigina muttemuvamti vaani

మున్నే పులుకడిగిన ముత్తెమువంటి వాని
Language

(॥పల్లవి॥)
మున్నే పులుకడిగిన ముత్తెమువంటి వాని
చన్నులపై కస్తూ రేల సారె నంటించేవే

(॥॥)
సన్నలనే మోవి చూపి చవులూరక కొనేవు
యెన్నికైన పతి నెంగి లేల సేసేవే
కన్నుల కాటుక చూపు కుప్పే వాతని మీఁద
మన్నించే యాతని మేను మైలేల సేసేవే

(॥॥)
పుక్కిటి తమ్మలముతోఁ బొంచి యేకాంతా లాడేవు
తక్కక నోరి ఆ వేల తాఁకించేవే
పక్కన నాతని పాద పద్మాలు నెత్తిఁ బెట్టుక
మొక్కేవు నీ తల నేల ముడిచి వేసేవే

(॥॥)
అచ్చపు శ్రీ వేంకటేశు నలమి కౌఁగిటఁ బట్టి
కొచ్చి కూడే వేల అలుకుడు సేసేవే
నిచ్చలు నన్నేలినాఁ డు నీవూ గోరఁ జెనకేవు
అచ్చలాన నిఁక నేల అంటుపరచేవే

(||pallavi||)
munne pulugaḍigina muttĕmuvaṁṭi vāni
sannulabai kastū rela sārĕ naṁṭiṁcheve

(||||)
sannalane movi sūbi savulūraga kŏnevu
yĕnnigaina padi nĕṁgi lela seseve
kannula kāḍuga sūbu kuppe vādani mīm̐da
manniṁche yādani menu mailela seseve

(||||)
pukkiḍi tammalamudom̐ bŏṁchi yegāṁtā lāḍevu
takkaga nori ā vela tām̐kiṁcheve
pakkana nādani pāda padmālu nĕttim̐ bĕṭṭuga
mŏkkevu nī tala nela muḍisi veseve

(||||)
achchabu śhrī veṁkaḍeśhu nalami kaum̐giḍam̐ baṭṭi
kŏchchi kūḍe vela aluguḍu seseve
nichchalu nannelinām̐ ḍu nīvū goram̐ jĕnagevu
achchalāna nim̐ka nela aṁṭubaraseve