మునిముచ్చు వలపుల ముసగస లేమిటికి
(॥పల్లవి॥)
మునిముచ్చు వలపుల ముసగస లేమిటికి
పెనఁగి యచ్చమై యిట్టె బెరయఁగరాదా
(॥॥)
సందడి గొలువు సేసి సన్నలు మోవినే చూపి
చిందుకొనేవు చెమట చెక్కులవెంట
పొందు లింత గలిగితే బోరున సేసలు చల్లి
పెందలకాడే నీవూఁ బెండ్లాడరాదా
(॥॥)
చిఱునవ్వు నవ్వుతాను సిగ్గులువడుకొంటాను
కఱఁగేవు లోలోనే కాంతునిఁ జూచి
మొఱగుఁలింత నీకేల మోహించినదానవైతే
మెఱసి కాలుదొక్కి మేలమాడరాదా
(॥॥)
పేరటాలపై వచ్చి బిగ్గెఁ బసవు నలఁచి
కోరి చన్నులనొరసుకొనే వాతని
యీరీతి శ్రీవేంకటేశుఁడే నల మేలుమంగను
చేరి నన్ను గూడె నీవూ సేవ సేయరాదా
(||pallavi||)
munimuchchu valabula musagasa lemiḍigi
pĕnam̐gi yachchamai yiṭṭĕ bĕrayam̐garādā
(||||)
saṁdaḍi gŏluvu sesi sannalu movine sūbi
siṁdugŏnevu sĕmaḍa sĕkkulavĕṁṭa
pŏṁdu liṁta galigide boruna sesalu salli
pĕṁdalagāḍe nīvūm̐ bĕṁḍlāḍarādā
(||||)
siṟunavvu navvudānu sigguluvaḍugŏṁṭānu
kaṟam̐gevu lolone kāṁtunim̐ jūsi
mŏṟagum̐liṁta nīgela mohiṁchinadānavaide
mĕṟasi kāludŏkki melamāḍarādā
(||||)
peraḍālabai vachchi biggĕm̐ basavu nalam̐si
kori sannulanŏrasugŏne vādani
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍe nala melumaṁganu
seri nannu gūḍĕ nīvū seva seyarādā