Mumduvena keṟamgavu mohamuna neevadani

ముందువెన కెఱఁగవు మోహమున నీవతని
Language

(॥పల్లవి॥)
ముందువెన కెఱఁగవు మోహమున నీవతని
పొందుల నీ కొనగోళ్ళఁ బోట్లాడేవా

(॥ముందు॥)
మంచముపైఁ గూచుండి మాఁటలకుఁబెట్టి నీతో
కంచముపొత్తుకుఁ దీసి కడి యందిచ్చెను నీకు
యించుకంతాఁ గరఁగవు ఇదియేమే నీవతని
యించుక నీబొమ్మలను ముళ్ళఁబెట్టేవా

(॥ముందు॥)
జలకేలిసేసేచోట సరసములెల్లా నాడె
కొలువు లోపల నుండి కోరి తొడెక్కించుకొనె
కలసీఁ గలయవు నీకైవశమైనయతని
మొలకనీచన్నులనే మొనలుచూపేవా

(॥ముందు॥)
కాఁగిటిలో నినుఁగూడి కందువలెల్లా నంటె
మాఁగినమోవిరసాల మచ్చిక చూపె
చేఁగదేరఁ గూడితివి శ్రీ వేంకటేశ్వరుని
పాఁగినతమకములఁ బచ్చిసేసేవా

(||pallavi||)
muṁduvĕna kĕṟam̐gavu mohamuna nīvadani
pŏṁdula nī kŏnagoḽḽam̐ boṭlāḍevā

(||muṁdu||)
maṁchamubaim̐ gūsuṁḍi mām̐ṭalagum̐bĕṭṭi nīdo
kaṁchamubŏttugum̐ dīsi kaḍi yaṁdichchĕnu nīgu
yiṁchugaṁtām̐ garam̐gavu idiyeme nīvadani
yiṁchuga nībŏmmalanu muḽḽam̐bĕṭṭevā

(||muṁdu||)
jalagelisesesoḍa sarasamulĕllā nāḍĕ
kŏluvu lobala nuṁḍi kori tŏḍĕkkiṁchugŏnĕ
kalasīm̐ galayavu nīgaivaśhamainayadani
mŏlaganīsannulane mŏnalusūbevā

(||muṁdu||)
kām̐giḍilo ninum̐gūḍi kaṁduvalĕllā naṁṭĕ
mām̐ginamovirasāla machchiga sūbĕ
sem̐gaderam̐ gūḍidivi śhrī veṁkaḍeśhvaruni
pām̐ginadamagamulam̐ bachchisesevā