ముందుముందె యింకనైన మోసపోకువయ్య నీవు
(॥పల్లవి॥)
ముందుముందె యింకనైన మోసపోకువయ్య నీవు
మందయాన వాసికోడీ మనసెరంగదా
(॥ముందు॥)
సిగ్గుగలయాఁటది చేరఁ బిలువక యుంటే
యెగ్గులెంచక విభునినేల మానునే
దగ్గరి యంతలో వచ్చి తానెంత వేఁడుకొనిన
కగ్గినట్టి తనలోని కపటాలు మానునా
(॥ముందు॥)
ననుపు గలుగుదాని నవ్వుతో మాటాడకున్న
యినుమడి గోపగించకేల మానును
వినయాలిప్పుడు వచ్చి వేవేలు సేసినాను
నినుపుల పెదవిపై నిష్టూరాలు మానునా
(॥ముందు॥)
మరిగిన కాంతను మరఁగువెట్టేనంటే
యిరవై పైకొనుఁగాక యేల మానును
అరుదై శ్రీవెంకటేశ అతివఁ గూడితివిట్టె
సిరులంటుఁగాక సేసినమేలు దాఁగునా
(||pallavi||)
muṁdumuṁdĕ yiṁkanaina mosaboguvayya nīvu
maṁdayāna vāsigoḍī manasĕraṁgadā
(||muṁdu||)
siggugalayām̐ṭadi seram̐ biluvaga yuṁṭe
yĕggulĕṁchaga vibhuninela mānune
daggari yaṁtalo vachchi tānĕṁta vem̐ḍugŏnina
kagginaṭṭi tanaloni kabaḍālu mānunā
(||muṁdu||)
nanubu galugudāni navvudo māḍāḍagunna
yinumaḍi gobagiṁchagela mānunu
vinayālippuḍu vachchi vevelu sesinānu
ninubula pĕdavibai niṣhṭūrālu mānunā
(||muṁdu||)
marigina kāṁtanu maram̐guvĕṭṭenaṁṭe
yiravai paigŏnum̐gāga yela mānunu
arudai śhrīvĕṁkaḍeśha adivam̐ gūḍidiviṭṭĕ
sirulaṁṭum̐gāga sesinamelu dām̐gunā