ముందుముందే నిక్కితే మూరెఁడు మాట
(॥పల్లవి॥)
ముందుముందే నిక్కితే మూరెఁడు మాట
వొందితి నీ సతినైతే వొడఁబాటు లేదా
(॥ముందు॥)
కడదాఁక నీసుద్దులే కాంతలతోఁ జెప్పేవు
అడరి నామాటఁ గొంత ఆడనీరాదా
తొడిఁబడ నీవు గడుదొరవైతే రాజ్యమేలు
పడఁతులతోనే ఇంతబలువా నీకు
(॥ముందు॥)
సందడించి యెందునైనా సాకిరులేల పెట్టేవు
విందుఁగా నాతగ వింత విననీరాదా
కందువలఁ జెల్లుఁబడి గలితే నీవే బదుకు
యిందువదనలతోడ నెగసక్కెమేఁటికి
(॥ముందు॥)
పచరించి యాన నీవే పలుమారుఁ బెట్టుకొనే-
విచట నావొట్టుసత్యా లెక్కనీరాదా
రచన శ్రీవేంకటేశ రతుల నన్నుఁ గూడితివి
పచరించి నాతోనే పంతమా యిపుడు
(||pallavi||)
muṁdumuṁde nikkide mūrĕm̐ḍu māḍa
vŏṁdidi nī sadinaide vŏḍam̐bāḍu ledā
(||muṁdu||)
kaḍadām̐ka nīsuddule kāṁtaladom̐ jĕppevu
aḍari nāmāḍam̐ gŏṁta āḍanīrādā
tŏḍim̐baḍa nīvu gaḍudŏravaide rājyamelu
paḍam̐tuladone iṁtabaluvā nīgu
(||muṁdu||)
saṁdaḍiṁchi yĕṁdunainā sāgirulela pĕṭṭevu
viṁdum̐gā nādaga viṁta vinanīrādā
kaṁduvalam̐ jĕllum̐baḍi galide nīve badugu
yiṁduvadanaladoḍa nĕgasakkĕmem̐ṭigi
(||muṁdu||)
pasariṁchi yāna nīve palumārum̐ bĕṭṭugŏne-
visaḍa nāvŏṭṭusatyā lĕkkanīrādā
rasana śhrīveṁkaḍeśha radula nannum̐ gūḍidivi
pasariṁchi nādone paṁtamā yibuḍu