ముందు వెనక లెంచవు మురిపెములే చూపేవు
(॥పల్లవి॥)
ముందు వెనక లెంచవు మురిపెములే చూపేవు
యిందరిలో నీ యాస ఇంకా నెంత చూపేవే
(॥ముందు॥)
చన్నులపై కొంగు జారి సన్నలేమి సేసేవే
కన్నుల మించీఁ గాటు కెక్కడ చూచేవే
చిన్ని మోవిఁ దేనె చిందీ సిగ్గుతో నేల నవ్వేవే
యిన్నేసి కలికితనా లెంత నేరిచితివే
(॥ముందు॥)
చెక్కులఁ జెమట గారీ శిరసేమి వంచేవే
వుక్కుగోరివాఁ డేమౌనో వొరయకువే
పుక్కిటితమ్మ మెదిగీ పూఁచి మాటలే లాడేవే
యెక్కడలేని పగటు లెంత నేరిచితివే
(॥ముందు॥)
బలిమి గుచ్చెల వీడీ పాదమేల తొక్కేవే
యెలమిఁ బువ్వులు రాలీ యేల మొక్కేవే
ఆలమేల్మంగపతి నన్నలమె శ్రీవేంకటేశుఁ -
డేలయింపులాఁడివి నీవెంత నేరిచితివే
(||pallavi||)
muṁdu vĕnaga lĕṁchavu muribĕmule sūbevu
yiṁdarilo nī yāsa iṁkā nĕṁta sūbeve
(||muṁdu||)
sannulabai kŏṁgu jāri sannalemi seseve
kannula miṁchīm̐ gāḍu kĕkkaḍa sūseve
sinni movim̐ denĕ siṁdī siggudo nela navveve
yinnesi kaligidanā lĕṁta nerisidive
(||muṁdu||)
sĕkkulam̐ jĕmaḍa gārī śhirasemi vaṁcheve
vukkugorivām̐ ḍemauno vŏrayaguve
pukkiḍidamma mĕdigī pūm̐si māḍale lāḍeve
yĕkkaḍaleni pagaḍu lĕṁta nerisidive
(||muṁdu||)
balimi guchchĕla vīḍī pādamela tŏkkeve
yĕlamim̐ buvvulu rālī yela mŏkkeve
ālamelmaṁgabadi nannalamĕ śhrīveṁkaḍeśhum̐ -
ḍelayiṁpulām̐ḍivi nīvĕṁta nerisidive