ముందు ముందుగాఁ బతికి మొక్కితి ననరే మీరు
(॥పల్లవి॥)
ముందు ముందుగాఁ బతికి మొక్కితి ననరే మీరు
మందలించి తన మేలు మరచేనా నేను
(॥మందు॥)
చల్లఁగానే మాఁటలాడి చవులెల్లా బుట్టించి
పెల్లున నన్నిటా వలపించెఁగా తాను
యెల్లవారిలోనా నిఁక నెట్టు నన్ను మన్నించినా
చెల్లుబడిగానే సంతోసించుకొనే నేను
(॥ముందు॥)
పువ్వులనే నన్ను వేసి బుజ్జగించి సన్నసేసి
రివ్వనఁ జుట్టరికము రేఁచెఁగా తాను
రవ్వగాఁ దన నా పొందు రతికెక్కిన వెనక
నవ్వుతా నొక్క మనసుననే వుండే నేను
(॥ముందు॥)
గుట్టున నుంకువ వెట్టి కూరిములు చల్లి చల్లి
అట్టె నన్నుఁ గాఁగిటఁ బెండ్లాడెఁగాను తాను
పట్టపు దేవిఁగా నిట్టె పాలించె శ్రీవేంకటేశుఁ
డెట్టు నన్నుఁ భాలించినా నియ్యకొనే నేను
(||pallavi||)
muṁdu muṁdugām̐ badigi mŏkkidi nanare mīru
maṁdaliṁchi tana melu marasenā nenu
(||maṁdu||)
sallam̐gāne mām̐ṭalāḍi savulĕllā buṭṭiṁchi
pĕlluna nanniḍā valabiṁchĕm̐gā tānu
yĕllavārilonā nim̐ka nĕṭṭu nannu manniṁchinā
sĕllubaḍigāne saṁtosiṁchugŏne nenu
(||muṁdu||)
puvvulane nannu vesi bujjagiṁchi sannasesi
rivvanam̐ juṭṭarigamu rem̐sĕm̐gā tānu
ravvagām̐ dana nā pŏṁdu radigĕkkina vĕnaga
navvudā nŏkka manasunane vuṁḍe nenu
(||muṁdu||)
guṭṭuna nuṁkuva vĕṭṭi kūrimulu salli salli
aṭṭĕ nannum̐ gām̐giḍam̐ bĕṁḍlāḍĕm̐gānu tānu
paṭṭabu devim̐gā niṭṭĕ pāliṁchĕ śhrīveṁkaḍeśhum̐
ḍĕṭṭu nannum̐ bhāliṁchinā niyyagŏne nenu