ముందెఱఁగక కడు మురిపెము చూపేవు
(॥పల్లవి॥)
ముందెఱఁగక కడు మురిపెము చూపేవు
సందడిఁ బెనఁగిన సమ్మతి యౌనా
(॥ముందె॥)
వదలక పతిపై వలపులు చల్లుచు
యెదుటనె నవ్వే విది యేమే
పదరి యతఁడు నిను బిలిమి సేసితే
నుదుటున నందుకు నోపఁగఁగలవా
(॥ముందె॥)
వోడకతనికే వుదుటులు చూపుచు
వేడుకఁ బువ్వుల వేసేవు
కూడేనని తాఁ గుచములంటితే
యీడనె నీకది యితవయ్యీనా
(॥ముందె॥)
యిరవుగ శ్రీ వేంకటేశుఁ గలయుచును
సరములాడేవు సరుగనను
గొరబుగా నతఁడు గోర నూఁదితే
వొరటు లేక నీవోరువఁ గలవా
(||pallavi||)
muṁdĕṟam̐gaga kaḍu muribĕmu sūbevu
saṁdaḍim̐ bĕnam̐gina sammadi yaunā
(||muṁdĕ||)
vadalaga padibai valabulu sallusu
yĕduḍanĕ navve vidi yeme
padari yadam̐ḍu ninu bilimi seside
nuduḍuna naṁdugu nobam̐gam̐galavā
(||muṁdĕ||)
voḍagadanige vuduḍulu sūbusu
veḍugam̐ buvvula vesevu
kūḍenani tām̐ gusamulaṁṭide
yīḍanĕ nīgadi yidavayyīnā
(||muṁdĕ||)
yiravuga śhrī veṁkaḍeśhum̐ galayusunu
saramulāḍevu sarugananu
gŏrabugā nadam̐ḍu gora nūm̐dide
vŏraḍu lega nīvoruvam̐ galavā