Mumde yeṟamgavale mosivachche panulu

ముందే యెఱఁగవలె మోచివచ్చే పనులు
Language

(॥పల్లవి॥)
ముందే యెఱఁగవలె మోచివచ్చే పనులు
చెంది చేయి ముంచితేను సిగ్గులేడ నుండును

(॥ముందే॥)
వలదేలే చలము వనితకు నింతేసి
కలయక పోరాదు కాంతునితోను
పిలిచీ నాతఁడై తేను బిగిసేవు నీవైతే
బలిమి సేసితే మరి పంతమేడ నుండునే

(॥ముందే॥)
మంకుఁదన మేఁటికే మానినికి నింతేసి
అంకెకు రాకుండేవా అతనితోను
వంకలాడీ నాతఁడైతే వాదించేవు నీవైతే
సంకెలేక పెనంగితే చలమేడ నుండునే

(॥ముందే॥)
ఆరితేరి రవ్వలేలే అంగనకు నింతేసి
మారు నవ్వక మానేవా మగనితోను
యీరీతి శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నుఁ గూడె
గోరి గీరి చెనకితే గుట్టు లేడ నుండునే

(||pallavi||)
muṁde yĕṟam̐gavalĕ mosivachche panulu
sĕṁdi seyi muṁchidenu sigguleḍa nuṁḍunu

(||muṁde||)
valadele salamu vanidagu niṁtesi
kalayaga porādu kāṁtunidonu
pilisī nādam̐ḍai tenu bigisevu nīvaide
balimi seside mari paṁtameḍa nuṁḍune

(||muṁde||)
maṁkum̐dana mem̐ṭige māninigi niṁtesi
aṁkĕgu rāguṁḍevā adanidonu
vaṁkalāḍī nādam̐ḍaide vādiṁchevu nīvaide
saṁkĕlega pĕnaṁgide salameḍa nuṁḍune

(||muṁde||)
ārideri ravvalele aṁganagu niṁtesi
māru navvaga mānevā maganidonu
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
gori gīri sĕnagide guṭṭu leḍa nuṁḍune