ముందరివారికి నిదే మొదలు గాదా
(॥పల్లవి॥)
ముందరివారికి నిదే మొదలు గాదా
అందరీఁ దారుకాణించి అండవారే నగరా
(॥ముంద॥)
అవ్వల నెగ్గులువట్టెఆపెతో నేమి చెప్పినే
నవ్వుతా నాడినమాఁట నాఁటిమాటా
రవ్వగా నాపొకవేళ రాజముతో నలిగి
యెవ్వరిముందరనైనా యిట్టె పంగించదా
(॥ముంద॥)
పక్కన నేరము లెంచేపడఁతి కేల చూపెనే
మొక్కుచుఁ జేసినచేఁత మొన్నటిచేఁత
యెక్కువైననాయకుఁడు యింతకు వచ్చె ననుచు
చొక్కుచు నాసతి యిట్టె చులుకఁగాఁ జూడదా
(॥ముంద॥)
యింతితో శ్రీవేంకటేశుఁ డేల బయట వేసెనే
మంతనానఁ దనకీలు మానముకీలు
యెంతయినా నీరమణి యేతులకు యీ పనులు
చెంతఁ దాఁ గూడేటివేళ సిగ్గు విడిపించదా
(||pallavi||)
muṁdarivārigi nide mŏdalu gādā
aṁdarīm̐ dārugāṇiṁchi aṁḍavāre nagarā
(||muṁda||)
avvala nĕgguluvaṭṭĕābĕdo nemi sĕppine
navvudā nāḍinamām̐ṭa nām̐ṭimāḍā
ravvagā nābŏgaveḽa rājamudo naligi
yĕvvarimuṁdaranainā yiṭṭĕ paṁgiṁchadā
(||muṁda||)
pakkana neramu lĕṁchebaḍam̐ti kela sūbĕne
mŏkkusum̐ jesinasem̐ta mŏnnaḍisem̐ta
yĕkkuvainanāyagum̐ḍu yiṁtagu vachchĕ nanusu
sŏkkusu nāsadi yiṭṭĕ sulugam̐gām̐ jūḍadā
(||muṁda||)
yiṁtido śhrīveṁkaḍeśhum̐ ḍela bayaḍa vesĕne
maṁtanānam̐ danagīlu mānamugīlu
yĕṁtayinā nīramaṇi yedulagu yī panulu
sĕṁtam̐ dām̐ gūḍeḍiveḽa siggu viḍibiṁchadā