Mumdaridosamu vaaya mokkidi mayya

ముందరిదోసము వాయ మొక్కితి మయ్య
Language

(॥పల్లవి॥)
ముందరిదోసము వాయ మొక్కితి మయ్య
చెంది నీపనికి నోఁచితిగా నేను

(॥ముందరి॥)
అంగనలతో వాదు లడిచినకోవ మెల్ల
ముంగిట నుండిన నీపై ముంచితి నేను
చెంగట నూరకె నీ చిత్త మింత నొప్పించితి
సంగతిగా నెంత పాపజాతినో నేను

(॥ముందరి॥)
యెగసక్కెపుసవతు లే మేమో నవ్వఁగఁ జూచి
మొగము చూడక నామోము వంచితి
తగ వెఱఁగక నేనే తమకించితి నీ మీఁద
జిగి నన్నింత కట్టిణిఁ జేసెఁ గా దైవమూ

(॥ముందరి॥)
పడఁతులతోడ నేను పంత మాడినదాన నై
చిడుముడిఁ గూడి వచ్చి సేసితి నిన్నూ
కడఁగి శ్రీవెంకటేశ గబ్బి నైతిని రతుల
వెడఁగుఁజలాల నెంత వెఱ్ఱినో నేనూ

(||pallavi||)
muṁdaridosamu vāya mŏkkidi mayya
sĕṁdi nībanigi nom̐sidigā nenu

(||muṁdari||)
aṁganalado vādu laḍisinagova mĕlla
muṁgiḍa nuṁḍina nībai muṁchidi nenu
sĕṁgaḍa nūragĕ nī sitta miṁta nŏppiṁchidi
saṁgadigā nĕṁta pābajādino nenu

(||muṁdari||)
yĕgasakkĕbusavadu le memo navvam̐gam̐ jūsi
mŏgamu sūḍaga nāmomu vaṁchidi
taga vĕṟam̐gaga nene tamagiṁchidi nī mīm̐da
jigi nanniṁta kaṭṭiṇim̐ jesĕm̐ gā daivamū

(||muṁdari||)
paḍam̐tuladoḍa nenu paṁta māḍinadāna nai
siḍumuḍim̐ gūḍi vachchi sesidi ninnū
kaḍam̐gi śhrīvĕṁkaḍeśha gabbi naidini radula
vĕḍam̐gum̐jalāla nĕṁta vĕṭrino nenū