ముందరి కేది తెరువు ముకుందా యానతీవయ్యా
(॥పల్లవి॥)
ముందరి కేది తెరువు ముకుందా యానతీవయ్యా
అందరిలో నీకు శరణాగతుఁడ నైతిని
(॥ముందరి॥)
తొల్లి నిన్నుఁ గొలువని ద్రోహముననే కదా
మెల్లమి నానాజన్మములఁ బుట్టితి
చల్లని నీ నామ ముచ్చరించిన ద్రోహననే
వొల్లనే సంసారవార్ధి నోలలాడెను
(॥ముందరి॥)
వెన నిన్నుఁ బూజించి సేవించని ద్రోహననేకా
పసలేని పంచేంద్రియ బద్ధుఁడనైతి
కొసరి నిన్నే పొద్దు కొలవని ద్రోహననె
వనము గాని కర్మపు వలఁబడినాఁడను
(॥ముందరి॥)
మని మని నిన్ను నమ్మని ద్రోహమునఁ గదా
అనిశము నిటు నీ మాయకు లోనైతి
యెనలేని శ్రీ వేంకటేశ సర్వ ద్రోహిని
నినుఁ దలఁచి తలఁచి నీకే మొరవెట్టితి
(||pallavi||)
muṁdari kedi tĕruvu muguṁdā yānadīvayyā
aṁdarilo nīgu śharaṇāgadum̐ḍa naidini
(||muṁdari||)
tŏlli ninnum̐ gŏluvani drohamunane kadā
mĕllami nānājanmamulam̐ buṭṭidi
sallani nī nāma muchchariṁchina drohanane
vŏllane saṁsāravārdhi nolalāḍĕnu
(||muṁdari||)
vĕna ninnum̐ būjiṁchi seviṁchani drohananegā
pasaleni paṁcheṁdriya baddhum̐ḍanaidi
kŏsari ninne pŏddu kŏlavani drohananĕ
vanamu gāni karmabu valam̐baḍinām̐ḍanu
(||muṁdari||)
mani mani ninnu nammani drohamunam̐ gadā
aniśhamu niḍu nī māyagu lonaidi
yĕnaleni śhrī veṁkaḍeśha sarva drohini
ninum̐ dalam̐si talam̐si nīge mŏravĕṭṭidi