ముందరెరిగి బదుకు మోహపుదాన నేను
(॥పల్లవి॥)
ముందరెరిగి బదుకు మోహపుదాన నేను
సందడి జాణతనాలు చాలుఁజాలు నిఁకను
(॥ముంద॥)
జగడాలదాననా సరసపుదానఁ గాక
యెగసక్కే లింతులచే నే లాడించేవు
నగినట్లనే వుండు నాట దా కొనగోరు
వొగరులు మాతోడ వొద్దు వొద్దు నీకు
(॥ముంద॥)
పంతములదాననా పైకొనేటిదానఁ గాక
వంతులేల పెట్టేవు వాసు లెక్కించి
కాంతుఁడ ముదిరితేను కలియే మేడిదె గాదా
వింత గుణములు ఇఁక విడు విడు నీవు
(॥ముంద॥)
అలుకలదాననా నెయ్యపుదాన నేఁ గాక
పలుకుల నన్ను నేల భ్రమయించేవు
యెలమి శ్రీ వేంకటేశ యెనసితి మిఁక నుప్పు
యిలఁ జిందితే రెట్టించు యేల జోలి మనకు
(||pallavi||)
muṁdarĕrigi badugu mohabudāna nenu
saṁdaḍi jāṇadanālu sālum̐jālu nim̐kanu
(||muṁda||)
jagaḍāladānanā sarasabudānam̐ gāga
yĕgasakke liṁtulase ne lāḍiṁchevu
naginaṭlane vuṁḍu nāḍa dā kŏnagoru
vŏgarulu mādoḍa vŏddu vŏddu nīgu
(||muṁda||)
paṁtamuladānanā paigŏneḍidānam̐ gāga
vaṁtulela pĕṭṭevu vāsu lĕkkiṁchi
kāṁtum̐ḍa mudiridenu kaliye meḍidĕ gādā
viṁta guṇamulu im̐ka viḍu viḍu nīvu
(||muṁda||)
alugaladānanā nĕyyabudāna nem̐ gāga
palugula nannu nela bhramayiṁchevu
yĕlami śhrī veṁkaḍeśha yĕnasidi mim̐ka nuppu
yilam̐ jiṁdide rĕṭṭiṁchu yela joli managu