Mumdaremchi melamgave mummaadigi

ముందరెంచి మెలఁగవే ముమ్మాటికి
Language

(॥పల్లవి॥)
ముందరెంచి మెలఁగవే ముమ్మాటికి
మందలించి కోరికలు మట్టుపెట్టఁ గలవా

(॥॥)
సిగ్గులూ వడే వదేమే చెయిచాఁచి రమణుఁడు
వెగ్గళించి చెక్కునొక్కి వేఁడుకోఁగాను
తగ్గక చనుమొనలు తలచూపి పొదలఁగ
అగ్గమైన జవ్వనము అణఁచుకోఁ గలవా

(॥॥)
తెరలోని కేఁగేవేమే దిష్టించి చూచి యాతఁడు
పరగ నీమునిగొంగు వట్టి తియ్యఁగా
పరువమై నీమోవి పండుతేనేలు గారఁగా
మురిపేన వేరే నీవు మూసి దాఁచఁ గలవా

(॥॥)
నీవ్వెరఁగై నవ్వేవేమే నిన్ను శ్రీవేంకటేశుఁడు
చివ్వనఁ గాఁగిటఁగూడి చెమరించఁగా
పువ్వులై నీమేననెల్ల వులకలు నిండఁగాను
మువ్వంక నవి నీవు మోపు గట్టఁ గలవా

(||pallavi||)
muṁdarĕṁchi mĕlam̐gave mummāḍigi
maṁdaliṁchi korigalu maṭṭubĕṭṭam̐ galavā

(||||)
siggulū vaḍe vademe sĕyisām̐si ramaṇum̐ḍu
vĕggaḽiṁchi sĕkkunŏkki vem̐ḍugom̐gānu
taggaga sanumŏnalu talasūbi pŏdalam̐ga
aggamaina javvanamu aṇam̐sugom̐ galavā

(||||)
tĕraloni kem̐geveme diṣhṭiṁchi sūsi yādam̐ḍu
paraga nīmunigŏṁgu vaṭṭi tiyyam̐gā
paruvamai nīmovi paṁḍudenelu gāram̐gā
muribena vere nīvu mūsi dām̐sam̐ galavā

(||||)
nīvvĕram̐gai navveveme ninnu śhrīveṁkaḍeśhum̐ḍu
sivvanam̐ gām̐giḍam̐gūḍi sĕmariṁcham̐gā
puvvulai nīmenanĕlla vulagalu niṁḍam̐gānu
muvvaṁka navi nīvu mobu gaṭṭam̐ galavā