Mumdaranunna valabu mogisaatlaayam gaaga

ముందరనున్న వలపు మొగిచాట్లాయఁ గాక
Language

(॥పల్లవి॥)
ముందరనున్న వలపు మొగిచాట్లాయఁ గాక
పందెము వేసితే నాపాటిదయ్యీనా

(॥ముంద॥)
తెరవేసుసొని నీతో తియ్యనిమాటలాడి
తరితీవు వుట్టించె తరుణి
మరిగి యందుకే నీవు మరులు కొంటివిగాక
సరివట్టి చూచితే నాసాటి వచ్చీనా

(॥ముంద॥)
తలుపుమాటున నుండి తటుకనఁ దొంగిచూచి
తలఁపులోఁ దమిరేఁచీ తక్కరిచెలి
పలుమారు నందుకే బాఁతి పడితివిగాక
సలిగె చూపితే నా సవతు రాఁగలదా

(॥ముంద॥)
పచ్చడములోను చొచ్చి పక్కనఁ గాఁగిలించి
గచ్చుల ని న్నెలయించెఁ గలికి
అచ్చపు శ్రీవేంకటేశ అలమేల్మంగనయి నేను
ఇచ్చగించి కూడితే నాయీడు వచ్చీనా

(||pallavi||)
muṁdaranunna valabu mŏgisāṭlāyam̐ gāga
paṁdĕmu veside nābāḍidayyīnā

(||muṁda||)
tĕravesusŏni nīdo tiyyanimāḍalāḍi
taridīvu vuṭṭiṁchĕ taruṇi
marigi yaṁduge nīvu marulu kŏṁṭivigāga
sarivaṭṭi sūside nāsāḍi vachchīnā

(||muṁda||)
talubumāḍuna nuṁḍi taḍuganam̐ dŏṁgisūsi
talam̐pulom̐ damirem̐sī takkarisĕli
palumāru naṁduge bām̐ti paḍidivigāga
saligĕ sūbide nā savadu rām̐galadā

(||muṁda||)
pachchaḍamulonu sŏchchi pakkanam̐ gām̐giliṁchi
gachchula ni nnĕlayiṁchĕm̐ galigi
achchabu śhrīveṁkaḍeśha alamelmaṁganayi nenu
ichchagiṁchi kūḍide nāyīḍu vachchīnā