ముందరఁ బారెడి దేరు ముంచి వెనకా పులి
(॥పల్లవి॥)
ముందరఁ బారెడి దేరు ముంచి వెనకా పులి
యిందిరావిభుఁడే దిక్కు యింకఁ జేసేదేమి
(॥ముంద॥)
దేహము మోచితేను త్రిజగములకులోను
యీహల విరక్తుఁడుగా నెట్టు వచ్చును
సాహసించక లోనైతే సరుస మోక్షము లేదు
శ్రీహరి యెఱుఁగుఁ గాక సేసెది దేమి
(॥ముంద॥)
బలుసంసారి యయితే పాపపుణ్యములకు లో
నెలమి నిర్మలుఁడుగా నెట్టు వచ్చును
తలఁచి మానకుండితే తనకు సుఖము లేదు
యిలధరుఁడే యెఱుఁగు యిఁకఁ జేసేదేమి
(॥ముంద॥)
దైవమువాఁ డైతేను ధర్మములకెల్లలోను
యీవలఁ దప్పులు దారు లెట్టువచ్చును
భావించి తోయకుండితే పనులు తుద కెక్కవు
శ్రీవేంకటేశుఁ డెఱుఁగు సేసేటి దేమి
(||pallavi||)
muṁdaram̐ bārĕḍi deru muṁchi vĕnagā puli
yiṁdirāvibhum̐ḍe dikku yiṁkam̐ jesedemi
(||muṁda||)
dehamu mosidenu trijagamulagulonu
yīhala viraktum̐ḍugā nĕṭṭu vachchunu
sāhasiṁchaga lonaide sarusa mokṣhamu ledu
śhrīhari yĕṟum̐gum̐ gāga sesĕdi demi
(||muṁda||)
balusaṁsāri yayide pābabuṇyamulagu lo
nĕlami nirmalum̐ḍugā nĕṭṭu vachchunu
talam̐si mānaguṁḍide tanagu sukhamu ledu
yiladharum̐ḍe yĕṟum̐gu yim̐kam̐ jesedemi
(||muṁda||)
daivamuvām̐ ḍaidenu dharmamulagĕllalonu
yīvalam̐ dappulu dāru lĕṭṭuvachchunu
bhāviṁchi toyaguṁḍide panulu tuda kĕkkavu
śhrīveṁkaḍeśhum̐ ḍĕṟum̐gu seseḍi demi