Mumdara nemtido mugudanu nenide

ముందర నేఁటిదో ముగుదను నేనిదె
Language

(॥పల్లవి॥)
ముందర నేఁటిదో ముగుదను నేనిదె
విందువంటి పతి విడువఁగఁగలనా

(॥ముంద॥)
తలంపులోనినాతమకఁ బెంచిన
వొలికీఁ గన్నీ రొకటోకటి
వెలసిననామైవిరహము చూచిన
వులుకునఁ బులకలు నుదిరీ నిదివో

(॥ముంద॥)
పాయపుమదములపరవశము చెప్పిన
తోయపునిట్టూర్పు తొట్టీని
నాయపురమఱునినమ్మిక దలఁచిన
రాయడిఁజెమటలు రాలీ నిదివొ

(॥ముంద॥)
నెమ్మిఁ బాన్పుపై నేఁ జెయిచాఁచిన
తమ్మిగొరు పతిఁ దాఁకీని
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డితఁడే నన్ను
సమ్మతిఁ గూడఁగ సంతస మిదివో

(||pallavi||)
muṁdara nem̐ṭido mugudanu nenidĕ
viṁduvaṁṭi padi viḍuvam̐gam̐galanā

(||muṁda||)
talaṁpuloninādamagam̐ bĕṁchina
vŏligīm̐ gannī rŏgaḍogaḍi
vĕlasinanāmaivirahamu sūsina
vulugunam̐ bulagalu nudirī nidivo

(||muṁda||)
pāyabumadamulabaravaśhamu sĕppina
toyabuniṭṭūrbu tŏṭṭīni
nāyaburamaṟuninammiga dalam̐sina
rāyaḍim̐jĕmaḍalu rālī nidivŏ

(||muṁda||)
nĕmmim̐ bānpubai nem̐ jĕyisām̐sina
tammigŏru padim̐ dām̐kīni
yimmula śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍe nannu
sammadim̐ gūḍam̐ga saṁtasa midivo