ముందటికి వెనకకు మొక్కేము నీకు
(॥పల్లవి॥)
ముందటికి వెనకకు మొక్కేము నీకు
కందువ లన్నియు నీవె కనుకొమ్మీ యిఁకను
(॥మంద॥)
యిచ్చక మాడితి నేఁడు యింటికి నీవు రాఁగాను
కొచ్చి నిన్న రాకుండఁగఁ గొసరితిని
బచ్చెన వేఁడివలపు పచ్చి దోఁచి చిగురాయ
తచ్చి తొల్లిటియలుక తలఁచకు మిఁకను
(॥ముంద॥)
కమ్మి నీవు చూడఁగాను కాను కిచ్చితి విప్పుడు
తమ్మిని వేసితిఁ దొల్లి తల వంచఁగా
వుమ్మగిలి నాసరస మొగ రెక్కి నిండఁ బూచె
దిమ్ము రేఁగినచలము తిప్పుకోకు మిఁకను
(॥ముంద॥)
గక్కన నీవు గూడఁగ గాఁగిలించుకొంటి నిట్టె
మెక్కలాన నల్లప్పుడు మొరఁగితిని
చిక్కన య్యనును నాయఁ జిత్తము శ్రీవెంకటేశ
నిక్కి నీకపటములు నెరపకు మిఁకను
(||pallavi||)
muṁdaḍigi vĕnagagu mŏkkemu nīgu
kaṁduva lanniyu nīvĕ kanugŏmmī yim̐kanu
(||maṁda||)
yichchaga māḍidi nem̐ḍu yiṁṭigi nīvu rām̐gānu
kŏchchi ninna rāguṁḍam̐gam̐ gŏsaridini
bachchĕna vem̐ḍivalabu pachchi dom̐si sigurāya
tachchi tŏlliḍiyaluga talam̐sagu mim̐kanu
(||muṁda||)
kammi nīvu sūḍam̐gānu kānu kichchidi vippuḍu
tammini vesidim̐ dŏlli tala vaṁcham̐gā
vummagili nāsarasa mŏga rĕkki niṁḍam̐ būsĕ
dimmu rem̐ginasalamu tippugogu mim̐kanu
(||muṁda||)
gakkana nīvu gūḍam̐ga gām̐giliṁchugŏṁṭi niṭṭĕ
mĕkkalāna nallappuḍu mŏram̐gidini
sikkana yyanunu nāyam̐ jittamu śhrīvĕṁkaḍeśha
nikki nīgabaḍamulu nĕrabagu mim̐kanu