ముందటనె నిలుచుండి మొక్కేము గాక
(॥పల్లవి॥)
ముందటనె నిలుచుండి మొక్కేము గాక
అందముగా మారుమాట లాఁడ గలమా
(॥ముందట॥)
అంగన నీమోము చూచె నట్టె నీవు చూచితిని
యింగితా లెరుఁగుదురు యిద్దరు మీరు
చెంగట నుండినయట్టి చెలులము నే మెల్ల
సంగ తెరఁగక మాటసరి తియ్యవచ్చునా
(॥ముందట॥)
వనిత నీతో నవ్వె వడి నీవూ నవ్వితివి
యెనలేని నేరుపరు లిద్దరూ మీరు
పనులు సేసేయట్టి పడఁతులము మేము
వెనక ముందటి మాట విన్నవించ వచ్చునా
(॥ముందట॥)
సతి నిన్ను గాఁగిలించె సమ్మతించి కూడితివి
యితవు లెరుఁగుదురు యిద్దరూ మీరు
తతి శ్రీవెంకటేశుఁడ తగు మీవారము నేము
మతకాన నిఁక మారుమాట లాడ వచ్చునా
(||pallavi||)
muṁdaḍanĕ nilusuṁḍi mŏkkemu gāga
aṁdamugā mārumāḍa lām̐ḍa galamā
(||muṁdaḍa||)
aṁgana nīmomu sūsĕ naṭṭĕ nīvu sūsidini
yiṁgidā lĕrum̐guduru yiddaru mīru
sĕṁgaḍa nuṁḍinayaṭṭi sĕlulamu ne mĕlla
saṁga tĕram̐gaga māḍasari tiyyavachchunā
(||muṁdaḍa||)
vanida nīdo navvĕ vaḍi nīvū navvidivi
yĕnaleni nerubaru liddarū mīru
panulu seseyaṭṭi paḍam̐tulamu memu
vĕnaga muṁdaḍi māḍa vinnaviṁcha vachchunā
(||muṁdaḍa||)
sadi ninnu gām̐giliṁchĕ sammadiṁchi kūḍidivi
yidavu lĕrum̐guduru yiddarū mīru
tadi śhrīvĕṁkaḍeśhum̐ḍa tagu mīvāramu nemu
madagāna nim̐ka mārumāḍa lāḍa vachchunā