ముంచుకొంటే వలపులు మొగచాటౌను
(॥పల్లవి॥)
ముంచుకొంటే వలపులు మొగచాటౌను
పొంచే వప్పటిని పొద్దువోదా నీకు
(॥॥)
వుంగిటిగాఁ జెక్కు నొక్కి వొడఁబరచేవు నన్ను
సంగడి నున్న చెలులు చాలరా నీకు
అంగవించి నాచే మాటలాడించుకొనేవు నీవు
యెంగిలి మోవి మీఁదివి యేఁటికి నీకు
(॥॥)
కొప్పువట్టి తీసి నన్నుఁ గొసరేవు ఆసలెల్లాఁ
గప్పే వూడిగాలవారు గారా నీకు
అప్పటి మాచన్నులొరయఁగ సాము సేయించేవు
యిప్పుడిట్టే చెమరించె యితవా నీకు
(॥॥)
కమ్మి నన్నుఁ గూడితివి గక్కన శ్రీవేంకటేశ
రమ్మంటేఁ దొంటిఁజుట్టాలు రారా నీకు
వుమ్మడి నన్నిపుడిట్టే వురమెక్కించుకొంటివి
తమ్మిపాదాలు మోవఁగఁ దగవా నీకు
(||pallavi||)
muṁchugŏṁṭe valabulu mŏgasāḍaunu
pŏṁche vappaḍini pŏdduvodā nīgu
(||||)
vuṁgiḍigām̐ jĕkku nŏkki vŏḍam̐barasevu nannu
saṁgaḍi nunna sĕlulu sālarā nīgu
aṁgaviṁchi nāse māḍalāḍiṁchugŏnevu nīvu
yĕṁgili movi mīm̐divi yem̐ṭigi nīgu
(||||)
kŏppuvaṭṭi tīsi nannum̐ gŏsarevu āsalĕllām̐
gappe vūḍigālavāru gārā nīgu
appaḍi māsannulŏrayam̐ga sāmu seyiṁchevu
yippuḍiṭṭe sĕmariṁchĕ yidavā nīgu
(||||)
kammi nannum̐ gūḍidivi gakkana śhrīveṁkaḍeśha
rammaṁṭem̐ dŏṁṭim̐juṭṭālu rārā nīgu
vummaḍi nannibuḍiṭṭe vuramĕkkiṁchugŏṁṭivi
tammibādālu movam̐gam̐ dagavā nīgu