ముంచుకొంటే వలపులు మొగచా టవును
(॥పల్లవి॥)
ముంచుకొంటే వలపులు మొగచా టవును
మంచముపై జాగరాలు మరి యేలయ్యా
(॥ముంచు॥)
పచ్చనిచిగురువంటి పళ్లెపు మోవిచెలి
కుచ్చి తేనెలమాటులు కురుసీ నదె
ఇచ్చకానఁ జెవి యొగ్గి యియ్యకొంటి వన్నియును
మచ్చిక నాపైఁ జల్లేవు మరి యేలయ్యా
(॥ముంచు॥)
కలువరేకులవంటి కన్నుల వెన్నెలతేట
పొలితి నేపై దిగఁజోసీ నదె
పొలసి నిలువుననె పూజ గొంటివి నీ వందు
మలసి మాకు మొక్కేవు మరి యేలయ్యా
(॥ముంచు॥)
సారె నిమ్మపండ్లవంటి చన్నులవొత్తులఁ జెలి
కోరిక రతులు నీపైఁ గులికీ నదె
కూరిమి శ్రీవెంకటేశ కూడితివి నన్నునిట్టె
మారు గొసరేవు నీవు మరి యేలయ్యా
(||pallavi||)
muṁchugŏṁṭe valabulu mŏgasā ṭavunu
maṁchamubai jāgarālu mari yelayyā
(||muṁchu||)
pachchanisiguruvaṁṭi paḽlĕbu movisĕli
kuchchi tenĕlamāḍulu kurusī nadĕ
ichchagānam̐ jĕvi yŏggi yiyyagŏṁṭi vanniyunu
machchiga nābaim̐ jallevu mari yelayyā
(||muṁchu||)
kaluvaregulavaṁṭi kannula vĕnnĕladeḍa
pŏlidi nebai digam̐josī nadĕ
pŏlasi niluvunanĕ pūja gŏṁṭivi nī vaṁdu
malasi māgu mŏkkevu mari yelayyā
(||muṁchu||)
sārĕ nimmabaṁḍlavaṁṭi sannulavŏttulam̐ jĕli
koriga radulu nībaim̐ guligī nadĕ
kūrimi śhrīvĕṁkaḍeśha kūḍidivi nannuniṭṭĕ
māru gŏsarevu nīvu mari yelayyā