ముంచుకొంటే పొందులెల్లా మొగచాటౌనో యేమో
(॥పల్లవి॥)
ముంచుకొంటే పొందులెల్లా మొగచాటౌనో యేమో
పెంచేవు వేడుకలు పెనఁగువడఁగను
(॥ముంచు॥)
గిలిగించే విటు నన్నుఁ గేరికేరి నవ్వుమని
పలుమారు నవ్వితేనుపాటివలదా
చలి వాసి మొక్కనంటా జంకించే వప్పటిని
చలి వాసితే వలపు చప్పనే కాదా
(॥ముంచు॥)
పెడరేఁచేవు సిగ్గులు బెట్టి కాఁగిలించుమని
కడుఁ గాఁగిలించితేను కాఁక వుట్టదా
విడువక కొసరేవు వింతచూపు చూడుమని
చిడుముడిఁ జూచితేనుచిత్తము నోనాఁటదా
(॥ముంచు॥)
నేరిపే వొక్కటొక్కటే నెయ్యపుమాటాడుమని
మారు మాటాడఁగఁబోతే మంకు రేఁగదా
యీరీతి శ్రీవేంకటేశ యొనసితి విటు నన్ను
గారవించే వివియెల్లా ఘనతలుగావా
(||pallavi||)
muṁchugŏṁṭe pŏṁdulĕllā mŏgasāḍauno yemo
pĕṁchevu veḍugalu pĕnam̐guvaḍam̐ganu
(||muṁchu||)
giligiṁche viḍu nannum̐ gerigeri navvumani
palumāru navvidenubāḍivaladā
sali vāsi mŏkkanaṁṭā jaṁkiṁche vappaḍini
sali vāside valabu sappane kādā
(||muṁchu||)
pĕḍarem̐sevu siggulu bĕṭṭi kām̐giliṁchumani
kaḍum̐ gām̐giliṁchidenu kām̐ka vuṭṭadā
viḍuvaga kŏsarevu viṁtasūbu sūḍumani
siḍumuḍim̐ jūsidenusittamu nonām̐ṭadā
(||muṁchu||)
neribe vŏkkaḍŏkkaḍe nĕyyabumāḍāḍumani
māru māḍāḍam̐gam̐bode maṁku rem̐gadā
yīrīdi śhrīveṁkaḍeśha yŏnasidi viḍu nannu
gāraviṁche viviyĕllā ghanadalugāvā