ముంచిన సంతసమున మోహించు టింతే కాక
(॥పల్లవి॥)
ముంచిన సంతసమున మోహించు టింతే కాక
యెంచి వీని గుణములు యేమని పొగడుదు
(॥ముంచి॥)
యిట్టేనేఁ బొయ్యేనంటే నింటిదాఁకా నంప వచ్చె
యెట్టు మఱవవచ్చునే యీతని మేలు
పట్టి తానే నన్ను పల్లకి యెక్కించెఁ దాను
నెట్టనఁ దనఋణ మెన్నిటఁ బాయు నాకు
(॥ముంచి॥)
చేరి నేను మొక్కగాను చేతు లెత్తి కౌఁగిలించె
వూరకే వీనిఁ బాసి యెట్టుండుదు నేను
గారవాన నే రాఁగా కలసొమ్ము లెల్లా నిచ్చె
మేరతో వీని మన్నన మెచ్చ కెట్టుండుదునే
(॥ముంచి॥)
అంతలోనే నంపవచ్చే నంటే నా యింటనే వుండె
యింత వాని కుపచార మేమి సేసేనే
మంతనాన నలమేలుమంగను న న్నిదె కూడె
బంతి శ్రీవేంకటాద్రిపతి నెంత మెత్తునే
(||pallavi||)
muṁchina saṁtasamuna mohiṁchu ṭiṁte kāga
yĕṁchi vīni guṇamulu yemani pŏgaḍudu
(||muṁchi||)
yiṭṭenem̐ bŏyyenaṁṭe niṁṭidām̐kā naṁpa vachchĕ
yĕṭṭu maṟavavachchune yīdani melu
paṭṭi tāne nannu pallagi yĕkkiṁchĕm̐ dānu
nĕṭṭanam̐ danaṛṇa mĕnniḍam̐ bāyu nāgu
(||muṁchi||)
seri nenu mŏkkagānu sedu lĕtti kaum̐giliṁchĕ
vūrage vīnim̐ bāsi yĕṭṭuṁḍudu nenu
gāravāna ne rām̐gā kalasŏmmu lĕllā nichchĕ
merado vīni mannana mĕchcha kĕṭṭuṁḍudune
(||muṁchi||)
aṁtalone naṁpavachche naṁṭe nā yiṁṭane vuṁḍĕ
yiṁta vāni kubasāra memi sesene
maṁtanāna nalamelumaṁganu na nnidĕ kūḍĕ
baṁti śhrīveṁkaḍādribadi nĕṁta mĕttune