ముంచి ని న్నేమనఁజాల మొక్కేమయ్యా నీ
(॥పల్లవి॥)
ముంచి ని న్నేమనఁజాల మొక్కేమయ్యా నీ
మంచితనమెల్లఁ గంటి మరఁగేలయ్యా
(॥మంచి॥)
యేకతాన నే నిన్ను నే మంటినో యంటా
ఆకడఁ జెలులతోడ నాడుకొనేవు
చేకొలఁది వైన నిన్నుఁ జేసినచేఁతలు మరి
రాకల పోకల నింత రచ్చ వేతురా
(॥మంచి॥)
తరితీపులను నీపైఁ దమకించితి నంటా
యిరుగుపొరుగు లేల యెరిఁగించేవు
సరసుఁడ వైన నిన్ను చనవునఁ గొసరితే
విరివి గొనుచు వెల్లవిరి నేతురా
(॥ముంచి॥)
గెంటక పెనఁగేవేళ గిలిగించితి నంటా
యింటివా రెల్ల వినఁగ నేల నవ్వేవు
జంటవై శ్రీవెంకటేశ సరి నన్నుఁ గూడితివి
నంటుతమకము లింత నాన వేతరా
(||pallavi||)
muṁchi ni nnemanam̐jāla mŏkkemayyā nī
maṁchidanamĕllam̐ gaṁṭi maram̐gelayyā
(||maṁchi||)
yegadāna ne ninnu ne maṁṭino yaṁṭā
āgaḍam̐ jĕluladoḍa nāḍugŏnevu
segŏlam̐di vaina ninnum̐ jesinasem̐talu mari
rāgala pogala niṁta rachcha vedurā
(||maṁchi||)
taridībulanu nībaim̐ damagiṁchidi naṁṭā
yirugubŏrugu lela yĕrim̐giṁchevu
sarasum̐ḍa vaina ninnu sanavunam̐ gŏsaride
virivi gŏnusu vĕllaviri nedurā
(||muṁchi||)
gĕṁṭaga pĕnam̐geveḽa giligiṁchidi naṁṭā
yiṁṭivā rĕlla vinam̐ga nela navvevu
jaṁṭavai śhrīvĕṁkaḍeśha sari nannum̐ gūḍidivi
naṁṭudamagamu liṁta nāna vedarā