Mumchi mumjeyee naadide moseyee naadum gaaga

ముంచి ముంజేయీ నాడితే మోచేయీ నాడుఁ గాక
Language

(॥పల్లవి॥)
ముంచి ముంజేయీ నాడితే మోచేయీ నాడుఁ గాక
మంచితనము లేకుంటే మరిగీనా తాను

(॥ముంచి॥)
ఇచ్చకమాడేవారినే ఇందు రమ్మందురుగాక
తుచ్చమాడేవారినేల తొంగిచూతురు
మచ్చిక నేఁ జేయఁగానే మనసిచ్చెఁగాక తాను
వొచ్చెములు దన్నెంచితే వొనగూడీనా

(॥ముంచి॥)
అడ్డాలుచెప్పనివారి కట్టె వలతురుగాక
వొడ్డారపువారికేల వొద్దికౌదురు
వెడ్డువెట్టి వేడుకోఁగా విడువకున్నాఁడు గాక
యెడ్డెతనాన నుండితే ఇయ్యకొనీనా

(॥ముంచి॥)
గక్కన మొక్కినవారిఁ గాఁగిట నింతురుగాక
కక్కసపువారినేల కై కొందురు
నిక్కి శ్రీవేంకటేశుఁడు నేఁ గూడఁగాఁ జిక్కెఁగాక
మొక్కలాన నూరకుంటే మోహించీనా

(||pallavi||)
muṁchi muṁjeyī nāḍide moseyī nāḍum̐ gāga
maṁchidanamu leguṁṭe marigīnā tānu

(||muṁchi||)
ichchagamāḍevārine iṁdu rammaṁdurugāga
tuchchamāḍevārinela tŏṁgisūduru
machchiga nem̐ jeyam̐gāne manasichchĕm̐gāga tānu
vŏchchĕmulu dannĕṁchide vŏnagūḍīnā

(||muṁchi||)
aḍḍālusĕppanivāri kaṭṭĕ valadurugāga
vŏḍḍārabuvārigela vŏddigauduru
vĕḍḍuvĕṭṭi veḍugom̐gā viḍuvagunnām̐ḍu gāga
yĕḍḍĕdanāna nuṁḍide iyyagŏnīnā

(||muṁchi||)
gakkana mŏkkinavārim̐ gām̐giḍa niṁturugāga
kakkasabuvārinela kai kŏṁduru
nikki śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ gūḍam̐gām̐ jikkĕm̐gāga
mŏkkalāna nūraguṁṭe mohiṁchīnā