Mumchi kadalagum gaallu mumtagum jevu ladigevu

ముంచి కతలకుఁ గాళ్లు ముంతకుఁ జెవు లడిగేవు
Language

(॥పల్లవి॥)
ముంచి కతలకుఁ గాళ్లు ముంతకుఁ జెవు లడిగేవు
అంచెల మోవితిట్ల కందుకేమడిగేవు

(॥ముంచి॥)
గబ్బితనాననాడినకాఁకలమాటలకెల్లా
గొబ్బునఁ దెలుపుమని కొంగువట్టేవు
వుబ్బున రతివేళల నొకటొకటే యాడిన-
అబ్బురపుసుద్దులకు నందుకేమనేవు

(॥ముంచి॥)
కూరిమి గొసరుతాను గొణఁగినబాసలకు
తారుకాఱించుమనుచు దగ్గరేవు
యేరోరి అనుచునాడే యింపులరాకొట్లకు
ఆరసి యేకతమున నప్పుడేమనేవు

(॥ముంచి॥)
జవ్వనమదాన నీపైఁ జల్లినపంతాలకు
చివ్వనఁ గాఁతాళించి చేయివట్టేవు
నవ్వుతా శ్రీవేంకటేశ నన్నుఁ గూడితి వింతలో
అవ్వల నిందుకు నాతో నర్త మేమనేవు

(||pallavi||)
muṁchi kadalagum̐ gāḽlu muṁtagum̐ jĕvu laḍigevu
aṁchĕla movidiṭla kaṁdugemaḍigevu

(||muṁchi||)
gabbidanānanāḍinagām̐kalamāḍalagĕllā
gŏbbunam̐ dĕlubumani kŏṁguvaṭṭevu
vubbuna radiveḽala nŏgaḍŏgaḍe yāḍina-
abburabusuddulagu naṁdugemanevu

(||muṁchi||)
kūrimi gŏsarudānu gŏṇam̐ginabāsalagu
tārugāṟiṁchumanusu daggarevu
yerori anusunāḍe yiṁpularāgŏṭlagu
ārasi yegadamuna nappuḍemanevu

(||muṁchi||)
javvanamadāna nībaim̐ jallinabaṁtālagu
sivvanam̐ gām̐tāḽiṁchi seyivaṭṭevu
navvudā śhrīveṁkaḍeśha nannum̐ gūḍidi viṁtalo
avvala niṁdugu nādo narda memanevu