Mullu mumta ne kaaga musalaanam deereenaa

ముల్లు ముంట నే కాక ముసలానఁ దీరీనా
Language

(॥పల్లవి॥)
ముల్లు ముంట నే కాక ముసలానఁ దీరీనా
చెల్లఁబెట్టేఁ గాని విచ్చేయవయ్య యీడకు

(॥ముల్లు॥)
మామాటలకే నీవు మారు మాటాడేవు గాని
ఆమగువ మాఁటకు నడ్డమాడేవా
గామిడి నీచేఁత లాడఁ గద్దనిపించేఁ గాని
యేమనినా నీడ నీవు ఇటు మెత్తనయ్యేవా

(॥ముల్లు॥)
వొంటినే చేయి చాఁచితే నొడ్డించుకొనేవుగాని
అంటఁ బట్టితే నాపె నౌఁ గాదనేవా
దంటతనా లిద్దరికిఁ దారుకాణ సేసేఁగాని
జంటలైన మాచేతఁ జాయకు వచ్చేవా

(॥ముల్లు॥)
చేరి మాచేత సేవలు సేయించుకొనేవు గాని
యీరీతి నాపెచేతఁ జేయించుకొనేవా
ఆరయ నిట్టె శ్రీవేంకటాధిప నన్నుఁ గూడితి
తేరె నన్నిపను లిఁక దిద్దించుకొనేవా

(||pallavi||)
mullu muṁṭa ne kāga musalānam̐ dīrīnā
sĕllam̐bĕṭṭem̐ gāni vichcheyavayya yīḍagu

(||mullu||)
māmāḍalage nīvu māru māḍāḍevu gāni
āmaguva mām̐ṭagu naḍḍamāḍevā
gāmiḍi nīsem̐ta lāḍam̐ gaddanibiṁchem̐ gāni
yemaninā nīḍa nīvu iḍu mĕttanayyevā

(||mullu||)
vŏṁṭine seyi sām̐side nŏḍḍiṁchugŏnevugāni
aṁṭam̐ baṭṭide nābĕ naum̐ gādanevā
daṁṭadanā liddarigim̐ dārugāṇa sesem̐gāni
jaṁṭalaina māsedam̐ jāyagu vachchevā

(||mullu||)
seri māseda sevalu seyiṁchugŏnevu gāni
yīrīdi nābĕsedam̐ jeyiṁchugŏnevā
āraya niṭṭĕ śhrīveṁkaḍādhiba nannum̐ gūḍidi
terĕ nannibanu lim̐ka diddiṁchugŏnevā