ముక్కుననే వున్నది ముంగోపమైతేను
(॥పల్లవి॥)
ముక్కుననే వున్నది ముంగోపమైతేను
యెక్కువ తక్కువలంటే నేమందువో
(॥ముక్కు॥)
వేడుకకు వెలలేదు వెన్నెలకు కొలలేదు
ఆడేటి నీ మాఁటలకు నడ్డము లేదు
వాడెనంటే నీ మోము వాదులకు వచ్చేవు
యేడనుంటివంటే నిఁక నే మందువో
(॥ముక్కు॥)
నవ్వు సిగ్గెరఁగదు వున్నతి రాయి గరఁగదు
రవ్వల నీసేఁతలైతే రాఁపు మానదు
యివ్వల నే విసరితే నీరసానఁ జూచేవు
యెవ్వతెవాఁడంటే నిఁక నే మందువో
(॥ముక్కు॥)
చిత్తానకు గురియేది చీఁకటికి గెర యేది
హత్తిన నీ మాయలకు నలవి యేది
యిత్తల శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
యెత్తి నిన్నుఁ బొగడితే నేమందువో
(||pallavi||)
mukkunane vunnadi muṁgobamaidenu
yĕkkuva takkuvalaṁṭe nemaṁduvo
(||mukku||)
veḍugagu vĕlaledu vĕnnĕlagu kŏlaledu
āḍeḍi nī mām̐ṭalagu naḍḍamu ledu
vāḍĕnaṁṭe nī momu vādulagu vachchevu
yeḍanuṁṭivaṁṭe nim̐ka ne maṁduvo
(||mukku||)
navvu siggĕram̐gadu vunnadi rāyi garam̐gadu
ravvala nīsem̐talaide rām̐pu mānadu
yivvala ne visaride nīrasānam̐ jūsevu
yĕvvadĕvām̐ḍaṁṭe nim̐ka ne maṁduvo
(||mukku||)
sittānagu guriyedi sīm̐kaḍigi gĕra yedi
hattina nī māyalagu nalavi yedi
yittala śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
yĕtti ninnum̐ bŏgaḍide nemaṁduvo