Mukku meemdi veli toda mumdada numdem gaaga

ముక్కు మీఁది వేలి తోడ ముందట నుండేఁ గాక
Language

(॥పల్లవి॥)
ముక్కు మీఁది వేలి తోడ ముందట నుండేఁ గాక
వక్కణగా తనతో నే వాదించ నేలే

(॥॥)
సాకిరి చెప్పి నిజాలే సారెకు నెరపఁగాను
కై కొని వినేఁ గాక కా దన నేలే
జోకలుగాఁ దన మేని చొప్పులు చూపి మోపి
నాకు నాకే సెలవుల నవ్వఁగ నేలే

(॥॥)
వొడివట్టు కొని నన్ను నొడఁబరచి చెప్పఁగా
వడిగా నూఁకొనేఁ గాక వద్దన నేలే
తడఁ బడే పెదవుల దప్పికిఁ బన్నీ రిచ్చి
అడియాస నన్ను నడుగ నేలే

(॥॥)
పక్కనఁ దన పలువరుఁ పలుమారుఁ జెప్పఁగాను
లెక్కలు వెట్టేఁ గాక లేదన నేలే
ఇక్కువతో శ్రీ వేంకటేశుఁడు తానన్నుఁ గూడె
మొక్కితిఁ దన నేరుపు ముదలించ నేలే

(||pallavi||)
mukku mīm̐di veli toḍa muṁdaḍa nuṁḍem̐ gāga
vakkaṇagā tanado ne vādiṁcha nele

(||||)
sāgiri sĕppi nijāle sārĕgu nĕrabam̐gānu
kai kŏni vinem̐ gāga kā dana nele
jogalugām̐ dana meni sŏppulu sūbi mobi
nāgu nāge sĕlavula navvam̐ga nele

(||||)
vŏḍivaṭṭu kŏni nannu nŏḍam̐barasi sĕppam̐gā
vaḍigā nūm̐kŏnem̐ gāga vaddana nele
taḍam̐ baḍe pĕdavula dappigim̐ bannī richchi
aḍiyāsa nannu naḍuga nele

(||||)
pakkanam̐ dana paluvarum̐ palumārum̐ jĕppam̐gānu
lĕkkalu vĕṭṭem̐ gāga ledana nele
ikkuvado śhrī veṁkaḍeśhum̐ḍu tānannum̐ gūḍĕ
mŏkkidim̐ dana nerubu mudaliṁcha nele