ముగురువేలుపులకు మూలమితఁడు
(॥పల్లవి॥)
ముగురువేలుపులకు మూలమితఁడు
జిగిమీరి నెదుటను సేవించరే
(॥ముగురు॥)
అంచలఁ బన్నీటిబిందె లందుకొని యిందరును
నించి మజ్జనము దేవునికిఁ జేయఁగా
వంచి సముద్రముమీఁద వానము గురిసినట్టు
పొంచి యన్నిటాను ఉప్పొంగుచున్నాఁడు
(॥ముగురు॥)
పచ్చకప్పురము మేనఁ బలుమారు మెత్తఁగాను
తచ్చి వున్నమచంద్రుఁడే తానై వున్నాఁడు
అచ్చపుఁదట్టుపుణుఁగు ఆమీఁదఁ బుయ్యఁగాను
నిచ్చఁ గల్పకతరువునీడయై వున్నాఁడు
(॥ముగురు॥)
అలమేలిముంగతోడ నన్నిసొమ్ములు నించఁగా
పలువన్నెలసంపద యైనాఁడు
యెలమి శ్రీవేంకటేశుఁడిన్నిటాఁ బ్రతాపించి
కులికి పుణ్యాలకెల్లా గురియైనాఁడు
(||pallavi||)
muguruvelubulagu mūlamidam̐ḍu
jigimīri nĕduḍanu seviṁchare
(||muguru||)
aṁchalam̐ bannīḍibiṁdĕ laṁdugŏni yiṁdarunu
niṁchi majjanamu devunigim̐ jeyam̐gā
vaṁchi samudramumīm̐da vānamu gurisinaṭṭu
pŏṁchi yanniḍānu uppŏṁgusunnām̐ḍu
(||muguru||)
pachchagappuramu menam̐ balumāru mĕttam̐gānu
tachchi vunnamasaṁdrum̐ḍe tānai vunnām̐ḍu
achchabum̐daṭṭubuṇum̐gu āmīm̐dam̐ buyyam̐gānu
nichcham̐ galbagadaruvunīḍayai vunnām̐ḍu
(||muguru||)
alamelimuṁgadoḍa nannisŏmmulu niṁcham̐gā
paluvannĕlasaṁpada yainām̐ḍu
yĕlami śhrīveṁkaḍeśhum̐ḍinniḍām̐ bradābiṁchi
kuligi puṇyālagĕllā guriyainām̐ḍu