ముగురు వేలుపులకు మూల విూతఁడు
(॥పల్లవి॥)
ముగురు వేలుపులకు మూల విూతఁడు
జిగివిూఱి నెదుటను సేవించరే
(॥ముగురు॥)
అంచలఁ బన్నీటిబిందె లందుకొని యిందరును
నించి మజ్జనము దేవునికిఁ జేయఁగా
వంచి సముద్రము మీఁద వానలు గురిసినట్టు
పొంచి యన్నిటాను ఉప్పొంగుచు నున్నాఁడు
(॥ముగురు॥)
పచ్చకప్పురము మేనఁ బలుమారు మెత్తఁగాను
తచ్చి పున్నమచంద్రుఁడే తానై వున్నాఁడు
అచ్చపుఁ దట్టుపుణుఁగు ఆమీఁదఁ బుయ్యఁగాను
నిచ్చఁ గల్పకతరువునీడయై వున్నాఁడు
(॥ముగురు॥)
అలమేలుమంగతోడ నన్ని సొమ్ములు నించఁగా
పలు పంచవన్నెల సంపద యైనాఁడు
యెలమి శ్రీవేంకటేశుఁ డిన్నిటాఁ బ్రతాపించి
కులికి పుణ్యాల కెల్లా గురియైనాఁడు
(||pallavi||)
muguru velubulagu mūla viూtam̐ḍu
jigiviూṟi nĕduḍanu seviṁchare
(||muguru||)
aṁchalam̐ bannīḍibiṁdĕ laṁdugŏni yiṁdarunu
niṁchi majjanamu devunigim̐ jeyam̐gā
vaṁchi samudramu mīm̐da vānalu gurisinaṭṭu
pŏṁchi yanniḍānu uppŏṁgusu nunnām̐ḍu
(||muguru||)
pachchagappuramu menam̐ balumāru mĕttam̐gānu
tachchi punnamasaṁdrum̐ḍe tānai vunnām̐ḍu
achchabum̐ daṭṭubuṇum̐gu āmīm̐dam̐ buyyam̐gānu
nichcham̐ galbagadaruvunīḍayai vunnām̐ḍu
(||muguru||)
alamelumaṁgadoḍa nanni sŏmmulu niṁcham̐gā
palu paṁchavannĕla saṁpada yainām̐ḍu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍinniḍām̐ bradābiṁchi
kuligi puṇyāla kĕllā guriyainām̐ḍu