Muguda mugudadanamunam buchchem gaalamella

ముగుద ముగుదతనమునఁ బుచ్చెఁ గాలమెల్ల
Language

(॥పల్లవి॥)
ముగుద ముగుదతనమునఁ బుచ్చెఁ గాలమెల్ల
తగిలి నీ కాఁగిటిలో దగదేరు టెన్నఁడో

(॥ముగు॥)
తళుకున నిన్నుఁ జూచి తలుపుమాటున కేఁగె
కలికిసిగ్గుల కిఁక కడ యెన్నఁడో
యిల నీవు వటాడ నిటు కాలిగోర వ్రాసెఁ
దలవంచి యిఁక మారుత్తర మెన్నఁడో

(॥ముగు॥)
పాడిపాడి నీవు రాఁగాఁ బక్కనఁ దానము గుక్కె
తోడనే యీసిబ్బితి కిఁక తుద యెన్నఁడో
కూడఁ జెలితో నవ్వఁగ గోబ్బున నీవు నవ్వితి
గోడచి త్తరువు చూచీఁ గొంకుదేరు టెన్నఁడో

(॥ముగు॥)
పానుపఁ మీఁదికిఁ దోసి పచ్చిగాఁ గూడఁగాను
మేనిలోనే జునిఁగీ మేల మెన్నఁడో
మానక శ్రీవేంకటేశ మంతినాన నుండఁగాను
తా నూరకే వుండీ దంటతన మెన్నఁడో

(||pallavi||)
muguda mugudadanamunam̐ buchchĕm̐ gālamĕlla
tagili nī kām̐giḍilo dagaderu ṭĕnnam̐ḍo

(||mugu||)
taḽuguna ninnum̐ jūsi talubumāḍuna kem̐gĕ
kaligisiggula kim̐ka kaḍa yĕnnam̐ḍo
yila nīvu vaḍāḍa niḍu kāligora vrāsĕm̐
dalavaṁchi yim̐ka māruttara mĕnnam̐ḍo

(||mugu||)
pāḍibāḍi nīvu rām̐gām̐ bakkanam̐ dānamu gukkĕ
toḍane yīsibbidi kim̐ka tuda yĕnnam̐ḍo
kūḍam̐ jĕlido navvam̐ga gobbuna nīvu navvidi
goḍasi ttaruvu sūsīm̐ gŏṁkuderu ṭĕnnam̐ḍo

(||mugu||)
pānubam̐ mīm̐digim̐ dosi pachchigām̐ gūḍam̐gānu
menilone junim̐gī mela mĕnnam̐ḍo
mānaga śhrīveṁkaḍeśha maṁtināna nuṁḍam̐gānu
tā nūrage vuṁḍī daṁṭadana mĕnnam̐ḍo