Muddulugaaree momunanu

ముద్దులుగారీ మోమునను
Language

(॥పల్లవి॥)
ముద్దులుగారీ మోమునను
వొద్దిక నేమైన నొసగరె చెలులు

(॥ముద్దు॥)
చెక్కులవెంటాఁ జెమటలు గారీ
యెక్కడ నాడెనొ యిందాఁకా
చక్కఁ గృష్ణునికి జలకము సేయరె
నెక్కొని కాఁగిట నించరె చెలులు

(॥ముద్దు ॥)
పొరిఁబొరి నిట్టూర్పులు గడురేఁగెను
పరువులు వెట్టెనొ పడుచులతో
సరుగన శైత్యోపచారము సేయరె
యిరవుగ నుయ్యల నిడరే చెలులు

(॥ముద్దు॥)
చుట్టుకొన్నజడ చొల్లెము జారెను
వుట్టులు గొట్టెనొ వుదుటునను
పట్టి యలమేల్మంగపతి శ్రీవేంకటేశుఁ-
డిట్టిపనులవా రెంచరె చెలులు

(||pallavi||)
muddulugārī momunanu
vŏddiga nemaina nŏsagarĕ sĕlulu

(||muddu||)
sĕkkulavĕṁṭām̐ jĕmaḍalu gārī
yĕkkaḍa nāḍĕnŏ yiṁdām̐kā
sakkam̐ gṛṣhṇunigi jalagamu seyarĕ
nĕkkŏni kām̐giḍa niṁcharĕ sĕlulu

(||muddu ||)
pŏrim̐bŏri niṭṭūrbulu gaḍurem̐gĕnu
paruvulu vĕṭṭĕnŏ paḍusulado
sarugana śhaityobasāramu seyarĕ
yiravuga nuyyala niḍare sĕlulu

(||muddu||)
suṭṭugŏnnajaḍa sŏllĕmu jārĕnu
vuṭṭulu gŏṭṭĕnŏ vuduḍunanu
paṭṭi yalamelmaṁgabadi śhrīveṁkaḍeśhum̐-
ḍiṭṭibanulavā rĕṁcharĕ sĕlulu