Muddaraalavaidenemi vehamu soobamgavaddaa

ముద్దరాలవైతేనేమి వెూహము చూపఁగవద్దా
Language

(॥పల్లవి॥)
ముద్దరాలవైతేనేమి వెూహము చూపఁగవద్దా
కొద్దిమీర పతివద్దఁ గూచుండవే

(॥॥)
చెక్కుచేయేల పెట్టేవే సిగ్గులేల నెరుపేవే
చిక్కనిచెమటలేల చిందేవే
నిక్కిచూచి రమణుఁ డు నిమ్మపండు చేతికిచ్చీ
మక్కువతో నందుకొని మాడలాడవే

(॥॥)
దప్పులఁ బొరలేవేలే తలవంచుకొననేలే
ముప్పిరి నీగుబ్బలేల మూసిదాఁచవే
కప్పురముఁ మోవిఁ జూపి కాంతుఁడు నిన్ను లాలించీ
వొప్పుగఁ జేకొని నీవూ నుపచరించవే

(॥॥)
నీవి వదలగనేలే నివ్వెరగు చూపనేలే
కావికన్నులకేల కడుబొక్కేవే
యీవల శ్రీవేంకటేశు డింతలోనె నిన్ను గూడె
వేవేగ నీప్రియములు వెలయించవే

(||pallavi||)
muddarālavaidenemi vĕూhamu sūbam̐gavaddā
kŏddimīra padivaddam̐ gūsuṁḍave

(||||)
sĕkkuseyela pĕṭṭeve siggulela nĕrubeve
sikkanisĕmaḍalela siṁdeve
nikkisūsi ramaṇum̐ ḍu nimmabaṁḍu sedigichchī
makkuvado naṁdugŏni māḍalāḍave

(||||)
dappulam̐ bŏralevele talavaṁchugŏnanele
muppiri nīgubbalela mūsidām̐save
kappuramum̐ movim̐ jūbi kāṁtum̐ḍu ninnu lāliṁchī
vŏppugam̐ jegŏni nīvū nubasariṁchave

(||||)
nīvi vadalaganele nivvĕragu sūbanele
kāvigannulagela kaḍubŏkkeve
yīvala śhrīveṁkaḍeśhu ḍiṁtalonĕ ninnu gūḍĕ
vevega nīpriyamulu vĕlayiṁchave