ముచ్చటాడేనంటే ముంచేవు పరవశాలు
(॥పల్లవి॥)
ముచ్చటాడేనంటే ముంచేవు పరవశాలు
వచ్చీరాక తొల్లే వలెనా నీ మాయలు
(॥ముచ్చ॥)
తమకాన నే నిన్ను దగ్గరి కూచుండితేను
కమలాన వేసి నన్నుఁ గరగించేవు
ప్రమదానఁ దొలుతనే బ్రమసినయాఁటదాని
తిమురు వలపుచల్లి దిమ్ము రేఁచవలెనా
(॥ముచ్చ॥)
మాటలాడేనంటా నీతో మనసై వచ్చివుండఁగా
నీటుననిప్పుడే మోవి నీవానేవు
ఆఁటదానియాస వేరే అంతరంగాననుండఁగా
తాఁటలఁ దూఁటలఁ బెట్టి తనియించవలెనా
(॥ముచ్చ॥)
ఆసపడి నీమోము అట్టె నేఁ జూడఁగానే
వేసానఁ గళ దాఁకించి వేగిరించితి
నీసరి సేసవెట్టితి నేనలమేల్‌మంగనిదె
రాసికి శ్రీవేంకటేశ రతులిన్నివలెనా
(||pallavi||)
muchchaḍāḍenaṁṭe muṁchevu paravaśhālu
vachchīrāga tŏlle valĕnā nī māyalu
(||muchcha||)
tamagāna ne ninnu daggari kūsuṁḍidenu
kamalāna vesi nannum̐ garagiṁchevu
pramadānam̐ dŏludane bramasinayām̐ṭadāni
timuru valabusalli dimmu rem̐savalĕnā
(||muchcha||)
māḍalāḍenaṁṭā nīdo manasai vachchivuṁḍam̐gā
nīḍunanippuḍe movi nīvānevu
ām̐ṭadāniyāsa vere aṁtaraṁgānanuṁḍam̐gā
tām̐ṭalam̐ dūm̐ṭalam̐ bĕṭṭi taniyiṁchavalĕnā
(||muchcha||)
āsabaḍi nīmomu aṭṭĕ nem̐ jūḍam̐gāne
vesānam̐ gaḽa dām̐kiṁchi vegiriṁchidi
nīsari sesavĕṭṭidi nenalamelmaṁganidĕ
rāsigi śhrīveṁkaḍeśha radulinnivalĕnā