మోసపోకు రమ్మలాల ముందెరిఁగి కృష్ణుఁడు
(॥పల్లవి॥)
మోసపోకు రమ్మలాల ముందెరిఁగి కృష్ణుఁడు
ఆసల నవ్వే రెవ్వరి నంత పచ్చి సేసెనో
(॥మోస॥)
యేకతానఁ జెవిలోన యెవ్వరికిఁ జెప్పరాని
పైకొని బూతు లాడీని బాలుఁడావీఁడు
వోకాంతపండ్లాని వొడి గొప్పై వున్నదంటా
చేకొని చేచాఁచీని శిశువా వీఁడు
(॥మోస॥)
ముంచి ముద్దువెట్టేనంటా మోవి నేమో సేయవచ్చె
పంచనుండేదుష్టుగాక పడుచా వీఁడు
అంచెల నప్పలప్పలని వచ్చి కాఁగిలించి
చంచుల మేనెల్ల గీరె సన్నమా వీఁడు
(॥మోస॥)
చలిగోనీనని వచ్చి సరి నాపయ్యద గప్పి
చెలఁగి కోకెల్లాఁ దీసె చిరుతా వీఁడు
తెలసి శ్రీవేంకటాద్రిక్రిష్ణుఁడు ఇందరి నిట్టె
కలగొనె మూలమూల కతకారి వీఁడు
(||pallavi||)
mosabogu rammalāla muṁdĕrim̐gi kṛṣhṇum̐ḍu
āsala navve rĕvvari naṁta pachchi sesĕno
(||mosa||)
yegadānam̐ jĕvilona yĕvvarigim̐ jĕpparāni
paigŏni būdu lāḍīni bālum̐ḍāvīm̐ḍu
vogāṁtabaṁḍlāni vŏḍi gŏppai vunnadaṁṭā
segŏni sesām̐sīni śhiśhuvā vīm̐ḍu
(||mosa||)
muṁchi mudduvĕṭṭenaṁṭā movi nemo seyavachchĕ
paṁchanuṁḍeduṣhṭugāga paḍusā vīm̐ḍu
aṁchĕla nappalappalani vachchi kām̐giliṁchi
saṁchula menĕlla gīrĕ sannamā vīm̐ḍu
(||mosa||)
saligonīnani vachchi sari nābayyada gappi
sĕlam̐gi kogĕllām̐ dīsĕ sirudā vīm̐ḍu
tĕlasi śhrīveṁkaḍādrikriṣhṇum̐ḍu iṁdari niṭṭĕ
kalagŏnĕ mūlamūla kadagāri vīm̐ḍu