Moosina mutyamuvale mumgida nunnadaana nenu

మూసిన ముత్యమువలె ముంగిట నున్నదాన నేను
Language

(॥పల్లవి॥)
మూసిన ముత్యమువలె ముంగిట నున్నదాన నేను
యే సుద్దు లెఱఁగ దైవ మెరిఁగితేఁ జాలును

(॥॥)
బెట్టి మాట లాఁడఁగాను ప్రియ మౌనో కాదో యంటా
గుట్టున నూర కున్నదానఁ గోపమా ఇది
అట్టి నావలపు నీతో నాడుకొందునా నేనే
ఇట్టి పనులెల్ల దైవ మెరిఁగితేఁ జాలును

(॥॥)
వీడెము నీ చేతి కియ్య వేళవునో కాదో యంటా
గోడమాటున నున్నదానఁ గోపమా ఇది
యేడనైనా నిల్లాండ్లు యెదురుకట్ల నుందురా
యేడ కేడ యిది దైవ మెరిఁగితేఁ జాలును

(॥॥)
యేచి నిన్నుఁగూడి ఇంకా నెంత గర్వమందు వంటాఁ
గూచుంటేఁ బాదాలవద్దఁ గోపమా ఇది
కాచి యలమేల్మంగను కై కొంటె శ్రీ వేంకటేశ
యీ చాయ నీవే దైవమ దెరిఁగితేఁ జాలును.

(||pallavi||)
mūsina mutyamuvalĕ muṁgiḍa nunnadāna nenu
ye suddu lĕṟam̐ga daiva mĕrim̐gidem̐ jālunu

(||||)
bĕṭṭi māḍa lām̐ḍam̐gānu priya mauno kādo yaṁṭā
guṭṭuna nūra kunnadānam̐ gobamā idi
aṭṭi nāvalabu nīdo nāḍugŏṁdunā nene
iṭṭi panulĕlla daiva mĕrim̐gidem̐ jālunu

(||||)
vīḍĕmu nī sedi kiyya veḽavuno kādo yaṁṭā
goḍamāḍuna nunnadānam̐ gobamā idi
yeḍanainā nillāṁḍlu yĕdurugaṭla nuṁdurā
yeḍa keḍa yidi daiva mĕrim̐gidem̐ jālunu

(||||)
yesi ninnum̐gūḍi iṁkā nĕṁta garvamaṁdu vaṁṭām̐
gūsuṁṭem̐ bādālavaddam̐ gobamā idi
kāsi yalamelmaṁganu kai kŏṁṭĕ śhrī veṁkaḍeśha
yī sāya nīve daivama dĕrim̐gidem̐ jālunu.