మూసిన ముత్యమువలె మూల లే లోయి
(॥పల్లవి॥)
మూసిన ముత్యమువలె మూల లే లోయి
మోస మెల్లాఁ దేరె నిఁక మొరఁ గే లోయి
(॥మూసిన॥)
పచ్చికస్తూరిబో ట్టంటి పరిమళించే దెల్లా
మెచ్చులా యిద్దరిలో నీ మేననా వోయి
గచ్చుల నెవ్వ రవుతా కానకుంటి మిందాఁకా
మచ్చెము బాయిటఁ బడె మాటలాడ వోయి
(॥మూసిన॥)
ముడిచివేసే పువ్వులు ముంగిట రాలే దెల్లా
చిడుముడి నెరుల నీ సిరసా వోయి
యెడసి యీగురు తిది యేరుపడ దిందాఁక
ఆడియాలము గంటిమి ఆన లేల వోయి
(॥మూసిన॥)
కుంకుమచెమటబొట్లు కురిసె నీడ నెల్లాను
లంకెలైన నీ చెక్కుల లాగాలా వోయి
అంకెల శ్రీవెంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
సంకె లెల్లఁ దేరె నిఁక జాగు లేల వోయి
(||pallavi||)
mūsina mutyamuvalĕ mūla le loyi
mosa mĕllām̐ derĕ nim̐ka mŏram̐ ge loyi
(||mūsina||)
pachchigastūribo ṭṭaṁṭi parimaḽiṁche dĕllā
mĕchchulā yiddarilo nī menanā voyi
gachchula nĕvva ravudā kānaguṁṭi miṁdām̐kā
machchĕmu bāyiḍam̐ baḍĕ māḍalāḍa voyi
(||mūsina||)
muḍisivese puvvulu muṁgiḍa rāle dĕllā
siḍumuḍi nĕrula nī sirasā voyi
yĕḍasi yīguru tidi yerubaḍa diṁdām̐ka
āḍiyālamu gaṁṭimi āna lela voyi
(||mūsina||)
kuṁkumasĕmaḍabŏṭlu kurisĕ nīḍa nĕllānu
laṁkĕlaina nī sĕkkula lāgālā voyi
aṁkĕla śhrīvĕṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
saṁkĕ lĕllam̐ derĕ nim̐ka jāgu lela voyi