Moosi moosi daamsanele mohamellaanu

మూసి మూసి దాఁచనేలే మోహమెల్లాను
Language

(॥పల్లవి॥)
మూసి మూసి దాఁచనేలే మోహమెల్లాను
ఆస యింత గలిగితే నండనే కూచుండవే

(॥మూసి॥)
కలువల వేసి గక్కనఁదల పంచనేలే
చెలిమిసేసినచోట సిగ్గులేలే
పలుకుతానే వట్టి పరవశ మందనేలే
వలపంత గలిగితె వద్దనే కూచుండవె

(॥మూసి॥)
చేరి మాట లాడి యాడి చెమరించ నిఁకి నేలే
సారె నవ్వుతా నిట్టె జంకించనేలే
పూరకే విడె మిచ్చి వుమ్మగిలే దిది యాలే
కారణ మింతగలిగితే గద్దెపైఁ గూచుండవే

(॥మూసి॥)
గుబ్బలు సోఁకఁగఁ బెనఁగి కొంకుచు లోఁగఁగ నేలే
నిబ్బరానఁ గూడి చింత నీ కిఁక నేలే
అబ్బురపలమేల్మంగ వాతఁడు శ్రీవేంకటేశుఁ
డుబ్బు నీ కింతగలిగితే నురాఁన గూచుండువే

(||pallavi||)
mūsi mūsi dām̐sanele mohamĕllānu
āsa yiṁta galigide naṁḍane kūsuṁḍave

(||mūsi||)
kaluvala vesi gakkanam̐dala paṁchanele
sĕlimisesinasoḍa siggulele
palugudāne vaṭṭi paravaśha maṁdanele
valabaṁta galigidĕ vaddane kūsuṁḍavĕ

(||mūsi||)
seri māḍa lāḍi yāḍi sĕmariṁcha nim̐ki nele
sārĕ navvudā niṭṭĕ jaṁkiṁchanele
pūrage viḍĕ michchi vummagile didi yāle
kāraṇa miṁtagaligide gaddĕbaim̐ gūsuṁḍave

(||mūsi||)
gubbalu som̐kam̐gam̐ bĕnam̐gi kŏṁkusu lom̐gam̐ga nele
nibbarānam̐ gūḍi siṁta nī kim̐ka nele
abburabalamelmaṁga vādam̐ḍu śhrīveṁkaḍeśhum̐
ḍubbu nī kiṁtagaligide nurām̐na gūsuṁḍuve