మూసి మంతనములేల ముసిముసి నవ్వులేల
(॥పల్లవి॥)
మూసి మంతనములేల ముసిముసి నవ్వులేల
చేసిన చేఁతలెల్లాఁ జెప్పించుకోరాదా
(॥మూసి॥)
సెలవుల నవ్వీ చెలి యేఁటికో కాని
నెలకొన్నసింగారాల నిన్నుఁ జూచి
వెలి నేమిసేసితివో వెస నీకెఁ బిల్చి నీవు
కలిగినవెల్లాఁ దారుకాణించుకోరాదా
(॥మూసి॥)
వొద్దఁ బాయకున్నది వువిద యేఁటికో కాని
పొద్దుపొద్దు గాచుక నీపొంత నెపుడు
సుద్దు లేమిగలవో ఆచొప్పు లాపెనే యడిగి
బద్దులు తెలిసి నింద పాపుకొనరాదా
(॥మూసి॥)
మెచ్చి సన్న సేసీ యలమేల్ మంగ యేఁటికో కాని
కొచ్చి శ్రీవేంకటేశ నీకొలువులోన
ఇచ్చల బానుపుమీఁద యిద్దరుఁ గూడితి రిదె
హెచ్చి యీకెచే విడె మిప్పించుకోరాదా
(||pallavi||)
mūsi maṁtanamulela musimusi navvulela
sesina sem̐talĕllām̐ jĕppiṁchugorādā
(||mūsi||)
sĕlavula navvī sĕli yem̐ṭigo kāni
nĕlagŏnnasiṁgārāla ninnum̐ jūsi
vĕli nemisesidivo vĕsa nīgĕm̐ bilsi nīvu
kaliginavĕllām̐ dārugāṇiṁchugorādā
(||mūsi||)
vŏddam̐ bāyagunnadi vuvida yem̐ṭigo kāni
pŏddubŏddu gāsuga nībŏṁta nĕbuḍu
suddu lemigalavo āsŏppu lābĕne yaḍigi
baddulu tĕlisi niṁda pābugŏnarādā
(||mūsi||)
mĕchchi sanna sesī yalamel maṁga yem̐ṭigo kāni
kŏchchi śhrīveṁkaḍeśha nīgŏluvulona
ichchala bānubumīm̐da yiddarum̐ gūḍidi ridĕ
hĕchchi yīgĕse viḍĕ mippiṁchugorādā