Moosi mamtanaalamelu mooda gattevaa

మూసి మంతనాలమేలు మూట గట్టేవా
Language

(॥పల్లవి॥)
మూసి మంతనాలమేలు మూట గట్టేవా
వానుల వంతులనే వడ్డివారీనా

(॥మూసి॥)
మోనమున నుండనేలే మొకము వంచఁగనేలే
నానఁబెట్టితే వలపు నయమెక్కీనా
సానఁ బట్టేచూపులేలే సమ్మతిగా నినవ్వేలే
యీనెపాననైనఁ గొంత యీసు వోయీనా

(॥మూసి॥)
నేలవాఁత లిప్పుడేలే నివ్వెరగు నీ కేలే
మూలవేసితే వయసు మొదలయ్యీనా
తాలిము లింతేసేలే తడవు సేయఁగనేలే
కాలము గడపఁగాను కండగట్టీనా

(॥మూసి॥)
సెలవి నవ్వితివేలే చేతివిదింపులేలే
మొలపించేవు సిగ్గులే మొనలయ్యీనా
బలిము శ్రీవేంకటాదిపతి నేఁ గూడితి నిన్ను
పలుకుఁ బంతాన నింత పరిణామమా

(||pallavi||)
mūsi maṁtanālamelu mūḍa gaṭṭevā
vānula vaṁtulane vaḍḍivārīnā

(||mūsi||)
monamuna nuṁḍanele mŏgamu vaṁcham̐ganele
nānam̐bĕṭṭide valabu nayamĕkkīnā
sānam̐ baṭṭesūbulele sammadigā ninavvele
yīnĕbānanainam̐ gŏṁta yīsu voyīnā

(||mūsi||)
nelavām̐ta lippuḍele nivvĕragu nī kele
mūlaveside vayasu mŏdalayyīnā
tālimu liṁtesele taḍavu seyam̐ganele
kālamu gaḍabam̐gānu kaṁḍagaṭṭīnā

(||mūsi||)
sĕlavi navvidivele sedividiṁpulele
mŏlabiṁchevu siggule mŏnalayyīnā
balimu śhrīveṁkaḍādibadi nem̐ gūḍidi ninnu
palugum̐ baṁtāna niṁta pariṇāmamā