Moosi mamtanaaladodi mohamele

మూసి మంతనాలతోడి మోహమేలే
Language

(॥పల్లవి॥)
మూసి మంతనాలతోడి మోహమేలే
వేసరించనేలే మరి వేఁడుకొననేలే

(॥॥)
పిలిచినప్పుడు రాక బిగిసి వెనక నాతో
అలరి యెంతనవ్వినా నదియేలే
వలపుకాఁకలచేత వాడఁజేయనేలే మరి
చలువగాఁబన్నీరు చల్ల నేలే

(॥॥)
యింటికి వచ్చినపని యియ్యకోక మరి నా-
వెంటవెంటఁ దిరిగేటివేసాలేలే
తుంటతనమున నన్ను దూరనాడనేలే మరి
గెంటి యంతలోనేలే తాను కిందుపడనేలే

(॥॥)
చెక్కునొక్కి యప్పుడే చిడుముడిపడి మరి
అక్కరతోఁగాఁగిలించే దదియేలే
తెక్కుల శ్రీవెంకటాద్రిదేవుఁ డిట్టె నన్నుఁగూడె
చక్కటిసిగ్గులవేలే చవిదాయనేలే

(||pallavi||)
mūsi maṁtanāladoḍi mohamele
vesariṁchanele mari vem̐ḍugŏnanele

(||||)
pilisinappuḍu rāga bigisi vĕnaga nādo
alari yĕṁtanavvinā nadiyele
valabugām̐kalaseda vāḍam̐jeyanele mari
saluvagām̐bannīru salla nele

(||||)
yiṁṭigi vachchinabani yiyyagoga mari nā-
vĕṁṭavĕṁṭam̐ dirigeḍivesālele
tuṁṭadanamuna nannu dūranāḍanele mari
gĕṁṭi yaṁtalonele tānu kiṁdubaḍanele

(||||)
sĕkkunŏkki yappuḍe siḍumuḍibaḍi mari
akkaradom̐gām̐giliṁche dadiyele
tĕkkula śhrīvĕṁkaḍādridevum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
sakkaḍisiggulavele savidāyanele