Moosi daampiramulevi munugone valabulu

మూసి దాఁపిరములేవి మునుకొనె వలపులు
Language

(॥పల్లవి॥)
మూసి దాఁపిరములేవి మునుకొనె వలపులు
బాస చేసినప్పుడే బదికితిమి

(॥మూసి॥)
మచ్చికతో నీవు నాతో మాటలాడినప్పుడే
రచ్చకెక్కెఁ బనులెల్ల రాఁపైతిమి
కుచ్చికుచ్చి నీవు పొరుగున నున్నయపుడే
విచ్చనవిడిని వెల్లవిరులైతిమి

(॥మూసి॥)
నంటుచేసి నీవు నాతో నవ్వు నవ్వినప్పుడే
అంటిన మనసులతో నారడైతిమి
జంటయి వద్దఁగూచుండి చనవిచ్చినపుడే
యింటనింట నాడికెలకిరవైతిమి

(॥మూసి॥)
కతలుగా మోవిమీఁద గంటిచేసి నప్పుడే
రతిచేఁతలనుఁ గడు రవ్వయితిమి
యితవై శ్రీవేంకటేశ యెనసితివిపుడే
మితిమీఱి యిన్నిటాను మేలువారమైతిమి

(||pallavi||)
mūsi dām̐piramulevi munugŏnĕ valabulu
bāsa sesinappuḍe badigidimi

(||mūsi||)
machchigado nīvu nādo māḍalāḍinappuḍe
rachchagĕkkĕm̐ banulĕlla rām̐paidimi
kuchchiguchchi nīvu pŏruguna nunnayabuḍe
vichchanaviḍini vĕllavirulaidimi

(||mūsi||)
naṁṭusesi nīvu nādo navvu navvinappuḍe
aṁṭina manasulado nāraḍaidimi
jaṁṭayi vaddam̐gūsuṁḍi sanavichchinabuḍe
yiṁṭaniṁṭa nāḍigĕlagiravaidimi

(||mūsi||)
kadalugā movimīm̐da gaṁṭisesi nappuḍe
radisem̐talanum̐ gaḍu ravvayidimi
yidavai śhrīveṁkaḍeśha yĕnasidivibuḍe
midimīṟi yinniḍānu meluvāramaidimi