మూసీ మంతనము వద్దా ముగుద యీ జవరాలు
(॥పల్లవి॥)
మూసీ మంతనము వద్దా ముగుద యీ జవరాలు
సేసవెట్టి యింత కాకు సేతు రటవయ్యా
(॥॥)
పరాకు సేసుకొని పడఁతి వూరకుండినా
అరుదుగాఁ బచ్చిమాట లానతిచ్చేవు
శిరసు వంచుక లోలో సిగ్గులు వడఁగా నీవు
సరిఁ జన్నులపై కొంగు జార దీసేవు
(॥॥)
గుట్టు తోడఁ దాను నీ కొలువులు సేయఁగానే
గట్టి కొప్పువుంట లింటఁ గడువేసేవు
యెట్ట నెదుటనే వుండి యెఱుఁగమి సేసుకొంటే
తట్టు పుణుఁగెల్లాఁ బూసి తమకించేవు
(॥॥)
నెపములు వెట్టుకొని నెలఁతలతో నవ్వితే
చపలతఁ గెమ్మోవి చవిగోనేవు
యిపుడే శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ
రపముగఁ గూడి కడు రవ్వసేసేవు
(||pallavi||)
mūsī maṁtanamu vaddā muguda yī javarālu
sesavĕṭṭi yiṁta kāgu sedu raḍavayyā
(||||)
parāgu sesugŏni paḍam̐ti vūraguṁḍinā
arudugām̐ bachchimāḍa lānadichchevu
śhirasu vaṁchuga lolo siggulu vaḍam̐gā nīvu
sarim̐ jannulabai kŏṁgu jāra dīsevu
(||||)
guṭṭu toḍam̐ dānu nī kŏluvulu seyam̐gāne
gaṭṭi kŏppuvuṁṭa liṁṭam̐ gaḍuvesevu
yĕṭṭa nĕduḍane vuṁḍi yĕṟum̐gami sesugŏṁṭe
taṭṭu puṇum̐gĕllām̐ būsi tamagiṁchevu
(||||)
nĕbamulu vĕṭṭugŏni nĕlam̐talado navvide
sabaladam̐ gĕmmovi savigonevu
yibuḍe śhrī veṁkaḍeśha yīgĕ yalamelumaṁga
rabamugam̐ gūḍi kaḍu ravvasesevu