Mooremdu goppudodi muddaraaligi

మూరెఁడు గొప్పుతోడి ముద్దరాలికి
Language

(॥పల్లవి॥)
మూరెఁడు గొప్పుతోడి ముద్దరాలికి
చీరుమూరాడీ వలపు చిత్తగించవయ్యా

(॥మూరె॥)
కంచపుమోవి చూపి కాఁగిలించుమని నీకు
లంచమిచ్చీ నదివొ లలితాంగి
కొంచక పయ్మదలోని గుబ్బలు గానుకవట్టి
వంచనతో మొక్కీ నాకెవంక చూడవయ్యా

(॥మూరె॥)
చిక్కగా నవ్వులునవ్వి సిగ్గులువడుకొంటాను
చక్కెరమాఁట లాడీ జవరాలు
తక్కక కొలువు సేసి దండనుండి తమిరేఁచి
చెక్కునొక్కి వేఁడుకొనీ సేసవెట్టవయ్యా

(॥మూరె॥)
చల్లనిచూపులఁ జూచి సన్నలనే రతులకు
మెల్లనే పిలిచీ నలమేలుమంగ
యిల్లిదె శ్రీవేంకటేశ యింతలో నీవు గూడఁగా
చల్లీ నీపై సరసము చనవియ్యవయ్యా

(||pallavi||)
mūrĕm̐ḍu gŏppudoḍi muddarāligi
sīrumūrāḍī valabu sittagiṁchavayyā

(||mūrĕ||)
kaṁchabumovi sūbi kām̐giliṁchumani nīgu
laṁchamichchī nadivŏ lalidāṁgi
kŏṁchaga paymadaloni gubbalu gānugavaṭṭi
vaṁchanado mŏkkī nāgĕvaṁka sūḍavayyā

(||mūrĕ||)
sikkagā navvulunavvi sigguluvaḍugŏṁṭānu
sakkĕramām̐ṭa lāḍī javarālu
takkaga kŏluvu sesi daṁḍanuṁḍi tamirem̐si
sĕkkunŏkki vem̐ḍugŏnī sesavĕṭṭavayyā

(||mūrĕ||)
sallanisūbulam̐ jūsi sannalane radulagu
mĕllane pilisī nalamelumaṁga
yillidĕ śhrīveṁkaḍeśha yiṁtalo nīvu gūḍam̐gā
sallī nībai sarasamu sanaviyyavayyā