మూఁడు మూరుతులకెల్ల మూల మీతఁడు
(॥పల్లవి॥)
మూఁడు మూరుతులకెల్ల మూల మీతఁడు
వీఁడె పెక్కు మహిమల విట్ఠలేశుఁడు
(॥మూఁడు॥)
గోవరుదన మెత్తిన గోవిందుఁ డీతఁడు
గోవులఁ గాచిన యట్టి గోవాళుఁడు
భావించు సురలపాలి పారజాత మీతఁడు
వేవేలు మహిమల విట్ఠలేశుఁడు
(॥మూఁడు॥)
చక్కని గొల్లెతలకు జారపురుషుఁడీతఁడు
అక్కజపు వెన్నలకు నాసోదకాఁడు
పక్కన ద్రౌపదిఁగాచే పాచిక విద్య యీతఁడు
వెక్కసపు మహిమల విట్ఠలేశుఁడు
(॥మూఁడు॥)
బలువుఁడు పాండవపక్షపాతి యీతఁడు
వలసిన వారికెల్లా వరదుఁడు
అలరి శ్రేవేంకటేశుఁడై పొడచూపె నీతఁడు
వెలసిన మహిమల విట్ఠలేశుఁడు
(||pallavi||)
mūm̐ḍu mūrudulagĕlla mūla mīdam̐ḍu
vīm̐ḍĕ pĕkku mahimala viṭṭhaleśhum̐ḍu
(||mūm̐ḍu||)
govarudana mĕttina goviṁdum̐ ḍīdam̐ḍu
govulam̐ gāsina yaṭṭi govāḽum̐ḍu
bhāviṁchu suralabāli pārajāda mīdam̐ḍu
vevelu mahimala viṭṭhaleśhum̐ḍu
(||mūm̐ḍu||)
sakkani gŏllĕdalagu jāraburuṣhum̐ḍīdam̐ḍu
akkajabu vĕnnalagu nāsodagām̐ḍu
pakkana draubadim̐gāse pāsiga vidya yīdam̐ḍu
vĕkkasabu mahimala viṭṭhaleśhum̐ḍu
(||mūm̐ḍu||)
baluvum̐ḍu pāṁḍavabakṣhabādi yīdam̐ḍu
valasina vārigĕllā varadum̐ḍu
alari śhreveṁkaḍeśhum̐ḍai pŏḍasūbĕ nīdam̐ḍu
vĕlasina mahimala viṭṭhaleśhum̐ḍu