మూలనున్నవారి నీవు ముంగిట వేసితి । నీవే
(॥పల్లవి॥)
మూలనున్నవారి నీవు ముంగిట వేసితి । నీవే
నాలికాఁడ నేము నీతో నవ్వవచ్చితిమా
(॥మూల॥)
యెగ్గువట్టేవాఁడవు ఇంటికి రమ్మననేల
బగ్గన నీయంత నీవే బదుకరాదా
సిగ్గువడేవాఁడవు చేయి మాపైఁ జాఁచనేల
కగ్గి దవ్వుల నుండఁగఁ గాదు గూడ దంటిమా
(॥మూల॥)
అంతకోపగాఁడవు ఆయము లంటగనేల
కొంత దొరతనముతోఁ గూచుండరాదా
వంతమాడేవాఁడవు బడిబడి రావేల
కొంతపు నీకు బత్తి గొట్టానఁ బెట్టితిమా
(॥మూల॥)
కాఁగిలించేవాఁడవు కాఁకలు సేయఁగనేల
నీఁగని మంచితనమే నెరప రాదా
దాఁగక శ్రీవేంకటేశ దక్కఁ గూడితిని నన్ను
పాఁగినరతుల నిన్నుఁ బచ్చ గా నాడితిమా
(||pallavi||)
mūlanunnavāri nīvu muṁgiḍa vesidi | nīve
nāligām̐ḍa nemu nīdo navvavachchidimā
(||mūla||)
yĕgguvaṭṭevām̐ḍavu iṁṭigi rammananela
baggana nīyaṁta nīve badugarādā
sigguvaḍevām̐ḍavu seyi mābaim̐ jām̐sanela
kaggi davvula nuṁḍam̐gam̐ gādu gūḍa daṁṭimā
(||mūla||)
aṁtagobagām̐ḍavu āyamu laṁṭaganela
kŏṁta dŏradanamudom̐ gūsuṁḍarādā
vaṁtamāḍevām̐ḍavu baḍibaḍi rāvela
kŏṁtabu nīgu batti gŏṭṭānam̐ bĕṭṭidimā
(||mūla||)
kām̐giliṁchevām̐ḍavu kām̐kalu seyam̐ganela
nīm̐gani maṁchidaname nĕraba rādā
dām̐gaga śhrīveṁkaḍeśha dakkam̐ gūḍidini nannu
pām̐ginaradula ninnum̐ bachcha gā nāḍidimā