Moola nunna vaari mammu mumgida vesidivi

మూల నున్న వారి మమ్ము ముంగిట వేసితివి
Language

(॥పల్లవి॥)
మూల నున్న వారి మమ్ము ముంగిట వేసితివి
పోళిమి నాఁడువారు నీ పొరుగవుటే దోసమా

(॥మూల॥)
వచ్చి వచ్చి చేయి వట్టి వట్టియాన లెల్లఁ బెట్టి
చెచ్చెర న న్నిట్టె లోను సేసుకొంటివి
యిచ్చకుఁడ నన్నువలె నెవ్వతిఁ జేసితివో
యెచ్చి మగనాండ్లకు నీ యింటికి రాఁ బాసెరా

(॥మూల॥)
సారె సారె నవ్వు నవ్వి జవ్వాది చెక్కులఁ బూసి
పారి పారి నన్ను నింత భ్రమయించితి
వూరివారి నెల్లా నంతా వోరి కలయఁ గొంటివో
వారించి మానాపతులు వాడ నుంటే నేరమా

(॥మూల॥)
మెల్లనె మెల్లనె మొక్కి మేర మీరఁ గాఁగిలించి
కొల్లగా శ్రీవెంకటాద్రిఁ గూడితి నన్ను
వెల్లివలపులు చల్ల వెన్నముద్దకృష్ణుఁడా
గొల్లెతల కెల్ల నీ కుల మౌటే తగులా

(||pallavi||)
mūla nunna vāri mammu muṁgiḍa vesidivi
poḽimi nām̐ḍuvāru nī pŏrugavuḍe dosamā

(||mūla||)
vachchi vachchi seyi vaṭṭi vaṭṭiyāna lĕllam̐ bĕṭṭi
sĕchchĕra na nniṭṭĕ lonu sesugŏṁṭivi
yichchagum̐ḍa nannuvalĕ nĕvvadim̐ jesidivo
yĕchchi maganāṁḍlagu nī yiṁṭigi rām̐ bāsĕrā

(||mūla||)
sārĕ sārĕ navvu navvi javvādi sĕkkulam̐ būsi
pāri pāri nannu niṁta bhramayiṁchidi
vūrivāri nĕllā naṁtā vori kalayam̐ gŏṁṭivo
vāriṁchi mānābadulu vāḍa nuṁṭe neramā

(||mūla||)
mĕllanĕ mĕllanĕ mŏkki mera mīram̐ gām̐giliṁchi
kŏllagā śhrīvĕṁkaḍādrim̐ gūḍidi nannu
vĕllivalabulu salla vĕnnamuddakṛṣhṇum̐ḍā
gŏllĕdala kĕlla nī kula mauḍe tagulā