Moobudaamkaa noorage maa manasarasevu gaaga

మూపుదాఁకా నూరకే మా మనసరసేవు గాక
Language

(॥పల్లవి॥)
మూపుదాఁకా నూరకే మా మనసరసేవు గాక
కోపగించి నీకు బత్తి గొట్టానఁ బెట్టేమా

(॥వప॥)
పొందైన యాపె నీకు బుద్ది చెప్పవలెఁగాక
మందలించి యితరులమాట వినేవా
సందడి నీగుణా లాపె చక్కఁ బెట్టివలెఁగాక
కందున నీలోనివంకలు దిద్దేమా

(॥వప॥)
కూరిమియాపె నీకు కొనఁబెట్టవలెఁగాక
వూరివారెల్లా నీవొడిఁ గట్టేరా
మారుకొని యాపె నిన్ను మట్టుపెట్టవలెఁగాక
ఆరితేరి యిఁక నిన్ను నదలించేమా

(॥వప॥)
పచ్చి సేసి కూడి యాపె బ్రమయించవలెఁగాక
వచ్చిపోయిన వారికి వసమయ్యేవా
యిచ్చగించి శ్రీవేంకటేశ నన్ను నేలితివి
నిచ్చలు నీ రతులెల్లా నీకు నేరిపేమా

(||pallavi||)
mūbudām̐kā nūrage mā manasarasevu gāga
kobagiṁchi nīgu batti gŏṭṭānam̐ bĕṭṭemā

(||vaba||)
pŏṁdaina yābĕ nīgu buddi sĕppavalĕm̐gāga
maṁdaliṁchi yidarulamāḍa vinevā
saṁdaḍi nīguṇā lābĕ sakkam̐ bĕṭṭivalĕm̐gāga
kaṁduna nīlonivaṁkalu diddemā

(||vaba||)
kūrimiyābĕ nīgu kŏnam̐bĕṭṭavalĕm̐gāga
vūrivārĕllā nīvŏḍim̐ gaṭṭerā
mārugŏni yābĕ ninnu maṭṭubĕṭṭavalĕm̐gāga
ārideri yim̐ka ninnu nadaliṁchemā

(||vaba||)
pachchi sesi kūḍi yābĕ bramayiṁchavalĕm̐gāga
vachchiboyina vārigi vasamayyevā
yichchagiṁchi śhrīveṁkaḍeśha nannu nelidivi
nichchalu nī radulĕllā nīgu neribemā