Monnadisemtagu mokkenayyaa

మొన్నటిచేఁతకు మొక్కేనయ్యా
Language

(॥పల్లవి॥)
మొన్నటిచేఁతకు మొక్కేనయ్యా
చన్ను మొనలు నిను సాదించీనా

(॥మొన్న॥)
పాసి వుండి నినుఁ బలికినపలుకులు
మోసదీర నిదె మొక్కేనయ్యా
నీసరి వారము నే మావలపులు
దోస మొరఁగక తొడరీఁగాక

(॥మొన్న॥)
అక్కడ నీతో నలిగిన యలుకకు
ముక్కు మోవ నిదె మొక్కేనయ్యా
నెక్కొని నీ వెంత నే నెంత వయసే
పెక్కు గర్వములఁ బెంచీఁ గాక

(॥మొన్న॥)
పనివడి నీకొంగు వట్టినయందుకు
మునుప నే నిటు మొక్కేనయ్యా
యెనసితి శ్రీ వేంకటేశ నన్ను నిదె
మనసే నీరతి మరఁగీఁ గాక

(||pallavi||)
mŏnnaḍisem̐tagu mŏkkenayyā
sannu mŏnalu ninu sādiṁchīnā

(||mŏnna||)
pāsi vuṁḍi ninum̐ baliginabalugulu
mosadīra nidĕ mŏkkenayyā
nīsari vāramu ne māvalabulu
dosa mŏram̐gaga tŏḍarīm̐gāga

(||mŏnna||)
akkaḍa nīdo naligina yalugagu
mukku mova nidĕ mŏkkenayyā
nĕkkŏni nī vĕṁta ne nĕṁta vayase
pĕkku garvamulam̐ bĕṁchīm̐ gāga

(||mŏnna||)
panivaḍi nīgŏṁgu vaṭṭinayaṁdugu
munuba ne niḍu mŏkkenayyā
yĕnasidi śhrī veṁkaḍeśha nannu nidĕ
manase nīradi maram̐gīm̐ gāga